దినకరన్ వెనక్కు తగ్గారు
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత, శశికళ మేనల్లుడు దినకరన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల్లో వరస విజయాలతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని [more]
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత, శశికళ మేనల్లుడు దినకరన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల్లో వరస విజయాలతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని [more]
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత, శశికళ మేనల్లుడు దినకరన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల్లో వరస విజయాలతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తర్వాత తమిళనాడు జరిగిన ప్రతి ఎన్నికల్లో దినకరన్ పార్టీ పోటీ చేసింది. చతికల పడింది. కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. పార్టీ పెట్టిన తర్వాత ఒక్క విజయమూ దక్కకపోవడంతో దినకరన్ నాయకత్వంపై విశ్వాసం చల్లగిల్లింది.
అప్పటి నుంచి…..
అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన తర్వాత టీటీవీ దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ విజయం తెచ్చిన ఊపుతో దినకరన్ మేనత్త శశికళ సూచన, సలహాల మేరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. అన్నాడీఎంకే లో ఉన్న అసంతృప్త నేతలందరూ దినకరన్ పార్టీలో చేరిపోయారు. దీంతో రోజురోజుకూ దినకరన్ బలం పెరుగుతుందని అందరూ భావించారు. ఒకదశలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే సయితం కొంత కంగారు పడింది.
వరస ఎన్నికల్లో….
కానీ వరసగా జరిగిన ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ సొంతంగా బరిలోకి దిగింది. ఎవరితో పొత్తుకు దినకరన్ ఇష్టపడలేదు. అయితే శాసనసభ ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ చతికల పడింది. దీంతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సరైన కారణాలు చెప్పకపోయినా తమ లక్ష్యం 2021 సాధారణ ఎన్నికలేనంటున్నారు.
గుర్తు లేకపోవడంతో….
అయితే దినకరన్ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం గుర్తు అంటున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ గుర్తు వచ్చింది. అదే గుర్తు తమ పార్టీకి ఇవ్వాలని కోరినా ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. అంతేకాకుండా తమ పార్టీకిచెందిన అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయంచాలని కోరినా ఈసీ అంగీకరించలేదు. దీంతో తమ అపజయాలకు కారణం గుర్తేనంటున్నారు దినకరన్. అందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని దినకరన్ చెబుతున్నారు.