దినకరన్ ధీమా అదేనట
తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే దినకరన్ పార్టీ ఈ సారి కూటమిలో చేరుతుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్నది [more]
తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే దినకరన్ పార్టీ ఈ సారి కూటమిలో చేరుతుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్నది [more]
తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే దినకరన్ పార్టీ ఈ సారి కూటమిలో చేరుతుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది. దినకరన్ ను మేనత్త శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మేర ప్రభావం చూపగలిగింది.
ఆ కూటమిలో మాత్రం…..
అన్నాడీఎంకే తమ కూటమిలో దినకరన్ పార్టీని చేర్చుకునే అవకాశం లేదు. అన్నాడీఎంకేలో విలీనం చేస్తామన్నా అంగీకరించని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి, పార్టీ నేతగా పన్నీర్ సెల్వం డిసైడ్ అయ్యారు. ఇక శశికళ బ్యాచ్ కు అవకాశం లేనట్లేనని చెప్పాలి. దీంతో దినకరన్ పార్టీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదన్నది అందరికీ తెలిసిందే. గుర్తు కూడా ఈ పార్టీకి ఇబ్బందిగా మారింది. అన్నాడీఎంకే గుర్తు ఉంటుందన్న నమ్మకంతోనే అప్పట్లో దినకరన్ వెంట ఎమ్మెల్యేలు నడిచారు.
డీఎంకే వైపు…..
దీంతో దినకరన్ చూపు ఇప్పుడు డీఎంకే వైపు మళ్లిందంటున్నారు. దినకరన్ పార్టీ నుంచి కొందరు నేతలు ఇప్పటికే డీఎంకే వైపు వెళ్లారు. డీఎంకే కూటమి బలంగా ఉండటంతో దినకరన్ ఆ కూటమిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మేనత్త శశికళ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. బహుశ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
అక్కడా కష్టమేనా?
శశికళ జైలు నుంచి వచ్చిన తర్వాత పరిస్థతులను సమీక్షించి కూటమిలో చేరే విషయంపై దినకరన్ స్పష్టం చేస్తారని చెబుతున్నారు. దినకరన్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో పట్టుంది. ఈ కారణంతో డీఎంకే కూడా అంగీకరిస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పటికే డీఎంకే కూటమిలో అనేక పార్టీలున్నాయి. వాటిన్నంటికీ సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. డీఎంకే తన గుర్తు మీదే ఎక్కువ స్థానాలను పోటీ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో దినకరన్ పార్టీకి అవకాశముంటుందా? లేదా? అన్నది కూడా సందేహమే. మొత్తం మీద దినకరన్ డీఎంకే కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.