పాపం దినకరన్… ఎలాంటోడు…?
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత మరింత వేడెక్కాయి. ప్రధానంగా అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, అందులో నుంచి చీలి వచ్చి పార్టీ పెట్టిన దినకరన్ కు [more]
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత మరింత వేడెక్కాయి. ప్రధానంగా అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, అందులో నుంచి చీలి వచ్చి పార్టీ పెట్టిన దినకరన్ కు [more]
తమిళనాడు రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత మరింత వేడెక్కాయి. ప్రధానంగా అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, అందులో నుంచి చీలి వచ్చి పార్టీ పెట్టిన దినకరన్ కు కూడా కష్గాలు మొదలయ్యాయి. దినకరన్ ను ఫెయిల్యూర్ లీడర్ గా ముద్ర వేశారు. ఆయన నేతృత్వంలో పార్టీ బలోపేతం కాకపోగా, మరింత బలహీనమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీంతో శశికళ తన మేనల్లుడు దినకరన్ ను పార్టీకి దూరంగా ఉంచాలని నిర్ణయించారు.
పార్టీని నడిపించి…
శశికళ జైలులో ఉన్న సమయంలో దినకరన్ ఒంటిచేత్తో పార్టీని నడిపించారు. అప్పట్లో ఆర్కే నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో దినకరన్ విజయం సాధించడంతో ఆయన నాయకత్వంపై నమ్మ కం పెరిగింది. అప్పట్లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, తిరిగి ఉప ఎన్నికలు జరిగినా దినకరన్ వర్గీయులు గెలవకపోవడంతో ఆయనపై నమ్మకం సన్నగిల్లింది. ఇక అప్పట్లో తమిళనాడులో వచ్చిన వరస ఎన్నికలు దినకరన్ పార్టీకి పరాజయం తప్ప ఏమీ మిగలలేదు.
వరస ఓటములు…
అన్నాడీఎంకే నుంచి గెంటి వేయడంతో దినకరన్ శశికళ సూచన మేరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని పెట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో పొత్తులతో బరిలోకి దిగినా ఒక్క స్థానాన్ని కూడా దినకరన్ పార్టీ గెలుచుకోలేకపోయింది.
దీంతో పాటు పార్టీలో దినకరన్ ను వ్యతిరేకంగా గళం వినపడుతుంది. తన మాటను కూడా లెక్క చేయకుండా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల శశికళ దినకరన్ పై ఆగ్రహంతో ఉన్నారు.
దినకరన్ కు వ్యతిరేకంగా….
ఇటీవల కాలంలో ఏఎంఎంకే నేతలు దినకరన్ పై వరసగా శశికళకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది గమనించిన శశికళ దినకరన్ ను పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. స్వయంగా తానే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి శశికళ సిద్ధమయ్యారు. దీంతో దినకరన్ తాను పెట్టిన పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆయన వల్లనే పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలవలేదన్న నిర్ణయానికి వచ్చిన శశికళ దినకరన్ కు ఇక చెక్ పెట్టినట్లే అనుకోవాలి.