దినకరన్ లక్ష్యం అది ఒక్కటే… అందుకోసమే?
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చి కూడా బయటకు గెంటేయబడిన దినకరన్ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో [more]
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చి కూడా బయటకు గెంటేయబడిన దినకరన్ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో [more]
తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చి కూడా బయటకు గెంటేయబడిన దినకరన్ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవ్వాలని ఆలోచిస్తుంది. ఎంతలేదన్నా తమిళనాడులో జయలలిత అభిమానుల్లో ఎక్కువ శాతం శశికళను అభిమానిస్తారు. శశికళ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి జయలలిత కోసమే పనిచేశారు. అంతేకాకుండా జయలలిత బతికి ఉన్నంతకాలం శశికళ ఏ పదవి కోరుకోలేదు.
మరింత స్పీడ్ పెంచి…..
ఈ అంశాలను ఇప్పుడు దినకరన్ పార్టీ పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో దినకరన్ ఇప్పుడు మరింత స్పీడ్ పెంచారు. ఇటీవలే చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయానికి సమీపంలోనే దినకరన్ తన పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతోపాటు అన్ని జిల్లాలనూ పర్యటించాలని దినకరన్ డిసైడ్ అయ్యారు. దీంతో పాటు వచ్చే శాసనసభ ఎన్నికలలో కలసి వచ్చే పార్టీలతో కలసి వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు శశికళ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో…..
దీంతో పాటు త్వరలో రెండు శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. గుడియాత్తం, తిరువొత్తయూర్ లలో ఉప ఎన్నికల్లో దినకరన్ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవకుండా ఉండేందుకే పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే గెలవడంతో వారిని ఈ ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బకొట్టాలని దినకరన్ వ్యూహాన్ని రచిస్తున్నారు. ఓట్ల చీలిక ద్వారా అన్నాడీఎంకే తప్ప ఎవరికి లబ్ది జరిగినా పరవాలేదన్న ధోరణిలో దినకరన్ ఉన్నారు.
శశికళ చేతుల మీదుగానే…..
మరోవైపు శశికళ కూడా త్వరలో విడుదలవుతారని క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. శశికళ పార్టీ బాధ్యతలను చూసుకుంటారని కూడా నేతలకు చెబుతున్నారు. ఈ రకమైన సంకేతాలతో అధికార పార్టీలో బలమైన నేతలను తమవైపునకు తిప్పుకోవాలన్నది దినకకరన్ ప్రయత్నంగా కన్పిస్తుంది. శశికళ చేతుల మీదుగానే అభ్యర్థులకు బీఫారాలు ఇప్పిస్తామని కూడా దినకరన్ చెబుతున్నారు. అయితే టోటల్ గా అన్నాడీఎంకేను దెబ్బ తీసే లక్ష్యంగానే దినకరన్ అడుగులు ఉంటాయన్నద వాస్తవం.