దినకరన్ దౌడు తీయిస్తారా…?
టీటీవీ దినరన్ దారి ఎటు…? అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే [more]
టీటీవీ దినరన్ దారి ఎటు…? అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే [more]
టీటీవీ దినరన్ దారి ఎటు…? అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అధికార అన్నాడీఎంకే ను టార్గెట్ చేసుకుంటూనే ఆ పార్టీ శ్రేణులను, నాయకులను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు దినకరన్. జైల్లో ఉన్న శశికళ సూచనల మేరకు వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అన్న దానిపై పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు.
విలీనం అవుతుందని…..
గత కొంతకాలంగా అన్నాడీఎంకే లో దినకరన్ పార్టీని విలీనం చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు కూడా దినకరన్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని చెబుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. దినరకన్ పార్టీ చివరకు అన్నాడీఎంకేలో విలీనం అవ్వడం ఖాయమని వారు ప్రతి చోటా, ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రులు కూడా ఇదే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. దినకకరన్ ఏఎంఎంకేని అన్నాడీఎంకేలో విలీనం చేయాలని కేంద్రమంత్రి రామ్ దాస్ అధవాలే కోరిన సంగతి తెలిసిందే.
ప్రసక్తి లేదంటున్న….
అయితే దినకరన్ మాత్రం అన్నాడీఎంకే కూటమిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. అన్నాడీఎంకే బీజేపీతో కలుస్తుందని దినకరన్ బాహాటంగానే చెబుతున్నారు. తన మేనత్తను జైల్లో పెట్టడానికి కారణమైన బీజేపీ ఉన్న కూటమిలో ఎలా చేరతారనుకుంటున్నారని దినకరన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన టార్గెట్ అంతా పళనిస్వామి..పన్నీర్ సెల్వం మాత్రమే. అన్నాడీఎంకే ను చీల్చాలన్నది దినకరన్ యత్నం. వచ్చే ఉప ఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగితే చాలా మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వస్తారంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత పళని జాతకం తారుమారుఅవుతుందని దినకరన్ జోస్యం చెబుతున్నారు.
డీఎంకే విషయంలోనూ….
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఒక్కసీటు కూడా రాకుండా చేయాలంటే డీఎంకే తో చేతులు కలపాలా? వద్దా? అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలలో డీఎంకే తమ అభ్యర్థిని పోటీకి దింపకుంటే లోక్ సభ ఎన్నికల్లో దానికి మద్దతివ్వాలన్నది దినకరన్ ఆలోచనగా ఉంది. అయితే డీఎంకే తో కలస్తే పార్టీ పేరు బద్ నామ్ అవుతుంది. జయలిత పేరు మీద పెట్టిన పార్టీ కావడంతో అమ్మకు బద్ధ విరోధి అయిన డీఎంకే తో పొత్తు పెట్టుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్నది కూడా ఆ పార్టీలో కొందరి ఆలోచన. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన తర్వాతనే డీఎంకేతో కలసి పోటీ చేయాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకలో పార్టీని విలీనం చేసేది లేదని మాత్రం దినకరన్ స్పష్టం చేశారు.
- Tags
- amma makkal munnetra kajagam
- anna dmk
- by elections
- dmk
- mannar gudi mafia
- palani swamy
- panneer selvam
- sasikala
- stallin
- tamilnadu
- ttv dinakaran
- à° à°¨à±à°¨à°¾à°¡à±à°à°à°à±
- à° à°®à±à°® à°®à°à±à°à°²à± à°®à±à°¨à±à°¨à±à°à±à°° à°à°à°à°
- à°à°ª à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à±à°à±à°µà± దినà°à°°à°¨à±
- à°¡à±à°à°à°à±
- తమిళనాడà±
- పనà±à°¨à±à°°à± à°¸à±à°²à±à°µà°
- పళనిసà±à°µà°¾à°®à°¿
- శశిà°à°³
- à°¸à±à°à°¾à°²à°¿à°¨à±