ఆ సింబల్ ఇప్పడు చేటు తెచ్చేలా ఉందే…?
తమిళనాడులో అన్నాడీఎంకే కు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో…. దినకరన్ పార్టీకి అంతే ప్రతిష్టాత్మకం. తన కోసం వచ్చి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప [more]
తమిళనాడులో అన్నాడీఎంకే కు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో…. దినకరన్ పార్టీకి అంతే ప్రతిష్టాత్మకం. తన కోసం వచ్చి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప [more]
తమిళనాడులో అన్నాడీఎంకే కు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో…. దినకరన్ పార్టీకి అంతే ప్రతిష్టాత్మకం. తన కోసం వచ్చి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండటంతో దినకరన్ కూడా విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దినకరన్ తాను అనుకున్నట్లు జరగడం లేదు. పోటీ జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, 40 పార్లమెంటు స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకేలు బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూటమితో వెళుతుండటంతో కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తాయన్న ధీమాతో ఉన్నాయి.
ఆర్కే నగర్ ఫలితాలతో…..
కానీ దినకరన్ మాత్రం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పెట్టి ఒంటరిగానే బరిలోకి దిగారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలు శశికళకు, దినకరన్ కు రాజకీయంగా ఊపిరి పోశాయి. ఆ ఎన్నికల్లో దినకరన్ భారీ మెజారిటీ సాధించడంతో అన్నాడీఎంకే, డీఎంకేలు సయితం కంగుతిన్నాయి. ఆర్కే నగర్ ఫలితాలు రిపీట్ కావన్నది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. దీనికి తోడు దినకరన్ కు గుర్తు కేటాయింపు ఇబ్బందిగా మారింది.
కుక్కర్ గుర్తు కేటయించాలని….
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ గుర్తు కేటాయించారు. అప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేశారు. కుక్కర్ గుర్తు తమిళనాడులో అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు పార్టీ పెట్టడంతో కామన్ సింబల్ కింద ప్రెషర్ కుక్కర్ గుర్తును తమ పార్టీ అభ్మర్థులందరికీ కేటాయించాలని దినకరన్ కోరారు. ఎన్నికల కమిషన్ నో చెప్పడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే న్యాయస్థానంలో దినకరన్ పార్టీకి కామన్ సింబల్ ఇచ్చేందుకు అనుకూలంగా తీర్పు వచ్చినా కుక్కర్ గుర్తు మాత్రం రాలేదు.
స్వతంత్రులకు ఆ గుర్తు…..
కుక్కర్ గుర్తు ఇప్పటకే ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఆ గుర్తు వస్తుందేమోనని ఆశపడ్డారు. చివరకు కామన్ సింబల్ కింద గిఫ్ట్ బాక్సు గుర్తును దినకరన్ పార్టీకి కేటాయించారు. గిఫ్ట్ బాక్సు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దినకరన్ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురయింది. తమిళనాడులో అనేక నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కుక్కర్ గుర్తు కేటాయించడంతో దినకరన్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. ఆ గుర్తు పాపులర్ కావడంతో కుక్కర్ గుర్తు వచ్చిన అభ్యర్థులందరూ జోష్ మీదున్నారు. మరి కుక్కర్ విజిల్ మోగిస్తుందని నమ్ముకున్న దినకరన్ కు అదే కుక్కర్ దెబ్బతీస్తుందన్న ఆందోళన పట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.