తుమ్మల సెంట్రిక్‌గా తెలంగాణ రాజకీయం… ఏం జరుగుతోంది ?
తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి.. తుమ్మల నాగేశ్వరరావు విషయంలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. ఆయన తన పాత మిత్రుడు, టీడీపీ మాజీ నాయకుడు, [more]
తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి.. తుమ్మల నాగేశ్వరరావు విషయంలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. ఆయన తన పాత మిత్రుడు, టీడీపీ మాజీ నాయకుడు, [more]
తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి.. తుమ్మల నాగేశ్వరరావు విషయంలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. ఆయన తన పాత మిత్రుడు, టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న తన సామాజిక వర్గానికే చెందిన ఏపీ ఎంపీతో సన్నిహితంగా ఉంటున్నారని.. రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది.. తెలంగాణ రాజకీయాల్లోను, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీలో పనిచేశారు. తర్వాత కేసీఆర్ గూటికి చేరిపోయారు.
రాజకీయాలకు దూరంగా…..
ఈ క్రమంలో కేసీఆర్ దగ్గర మంచి గుర్తింపు లభించింది. గత ఫస్ట్ టెర్మ్‌లో మంత్రిగా కూడా చేశారు. ఇక, గత 2018 ఎన్నికల్లో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే… ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన కామెంట్లను బట్టి.. గెలిస్తే.. అసెంబ్లీలో ఉంటా.. లేకుంటే.. నా పొలంలో ఉంటా..! అని వ్యాఖ్యానించారు.. ఈ నేపథ్యంలో ఆయన ఓడిపోయిన తర్వాత తన పొలంలో పనులు చేసుకుంటున్నారు. అయితే.. మళ్లీ కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ అనుకున్నారు.
వచ్చినట్లే వచ్చి…..
అయితే, అనూహ్యంగా ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ఇష్టపడుతున్నట్టు కనిపించడం లేదని రాజకీయ వర్గాల మాట. దీంతో తుమ్మల నాగేశ్వరరావుకు అవకాశం వచ్చినట్టే వచ్చి జారి పోయింది. ఈ పరిణామంతో ఆయన ఒకింత ఆవేదనతో ఉన్న మాట వాస్తవమే. అయితే.. ఇదేదో పార్టీతో తెగతెంపులు చేసుకునే పరిస్థితి లేదనేది వాస్తవం. ఇక, ఏపీ బీజేపీకి చెందిన ఒక ఎంపీ.. గతంలో కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆయనతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు టచ్‌లో ఉన్నారనే వార్తలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.
ప్రచారం ఆగలేదే?
కొద్ది రోజులుగా తుమ్మల నాగేశ్వరరావు బీజేపీలోకి వెళ్లిపోతున్నారన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. వీటిని తుమ్మల ఖండించినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. అయితే.. దీనిని రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. వ్యాపారాలు, ఇతర అవసరాలు.. ఉండి ఉన్న నేపథ్యంతో పాటు.. గతంలో టీడీపీతో ఇద్దరూ కలిసి పనిచేసిన అనుభవం, పూర్వ పరిచయాలు వంటివి కూడా కారణమై ఉంటాయని అనేవారు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో…. ముఖ్యంగా టీఆర్ఎస్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది.