టర్కీ లో మంటలు మాములూగా లేవుగా?
మతం, రాజ్యం, రాజకీయం. . . . వేర్వేరు. ఈ ముాడు కలగలిస్తే మహా ప్రమాదం. తాత్కాలికంగా ప్రయెాజనకరంగా అనిపించినప్పటికి, రాజకీయలబ్ది చేకుారినప్పటికి భవష్యత్తులో పెనుముప్పునకు దారితీస్తుంది. [more]
మతం, రాజ్యం, రాజకీయం. . . . వేర్వేరు. ఈ ముాడు కలగలిస్తే మహా ప్రమాదం. తాత్కాలికంగా ప్రయెాజనకరంగా అనిపించినప్పటికి, రాజకీయలబ్ది చేకుారినప్పటికి భవష్యత్తులో పెనుముప్పునకు దారితీస్తుంది. [more]
మతం, రాజ్యం, రాజకీయం. . . . వేర్వేరు. ఈ ముాడు కలగలిస్తే మహా ప్రమాదం. తాత్కాలికంగా ప్రయెాజనకరంగా అనిపించినప్పటికి, రాజకీయలబ్ది చేకుారినప్పటికి భవష్యత్తులో పెనుముప్పునకు దారితీస్తుంది. ఇక మెజారిటీ వాదమూ అలాంటిదే. ప్రజాస్వామ్య వ్యవస్ధలో నిర్ణయాలకు, విధానాలకు మెజార్టీయే ప్రాతిపదిక. అంతమాత్రాన మైనార్టీ వాదాన్ని అణగదొక్కడం. విస్మరించడం సరికాదు. ఈ మెజార్టీ వాదం ఒక్కోసారి జాతీయవాదంగా మారుతుంది. ఇది కూడా ప్రమాదకరమే. ఇప్పుడు టర్కీలో జరగుతున్నది ఇదే. ఆసియా, ఐరోపా ఖండాల మధ్య చీలి ఉండే ఈ ముస్లిం దేశంలో ఇప్పుడు పెడధోరణులు ప్రబలుతున్నాయి. ఇందుకు స్వయంగా నర్కారే కంకణం కట్టుకోవడం ఆందోళన కలిగించే అంశం.
రేఖను చెరపేస్తున్నారా?
నాటో సభ్యత్వదేశమైన టర్కీ అధ్యక్షుడు అయ్యిప్ ఎర్డోగాన్ స్వయంగా మతానికి, రాజ్యానికి మధ్యగల సన్నని విభజనరేఖను చెరిపేసే ప్రయత్నం చేయడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 1700 సంవత్సరాల చరిత్రగల ఇస్తాంబుల్ లోని హాజియా సోషియా మ్యూజియాన్ని మసీదుగా మార్చి జులై 24 న (శుక్రవారం) న ప్రార్ధనలు ప్రారంభించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది మతాల మధ్య మరింత చీలిక తెచ్చే ప్రయత్నంగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అభివర్ణించారు. ఈ నిర్ణయం మున్ముందు ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన కుాడా వ్యక్తమవుతోంది. టర్కీని క్రిస్టియన్ రాజులు పాలించిన కాలంలో (ఆరోశతాబ్ధంలో) ఇస్తాంబుల్ లో అతిపెద్ద, అత్యాధునిక చర్చిని నిర్మించారు. ముస్లిం పాలకుల హయాంలో 1454 లో ఈ చర్చిని మసీదుగా మర్చారు. ఆధునిక టర్కీ నిర్మాత, దేశప్రజల జాతిపితగా పిలుచుకునే ముస్తాఫా కెమెల్ అటోటర్కీ లౌకిక భావాలుగల నాయకుడు. మతసామరస్యానికి ప్రధాన్యమిచ్చేవాడు. అందువల్లే దానిని అయిదేళ్ళపాటు చర్చిగా ఉంచారు. చివరికి 1930 లో దీనిని మ్యుాజియంగా మార్చారు.
దశాబ్దాలుగా కాపాడుకుంటూ….
ముస్లిం – క్రైస్తవ సామరస్యానికి ప్రతీకగా దానిని తీర్చిదిద్దారు. వారసత్వ సంపదను పరిరక్షించే చరిత్రగల టర్కీ దీనిని కాపాడుకుంటుా వచ్చింది. ఏటా దాదాపు 40 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. పదివేలమంది కార్మికులు అయిదేళ్ళపాటు శ్రమించి నిర్మించిన ఈ కట్టడాన్ని కాపాడేందుకు టర్కీ ప్రభుత్వాలు ఎనలేని శ్రద్ధచుాపాయి. అందువల్లే ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక ప్రస్తుత రాజకీయానికి వస్తే అధ్యక్షుడు ఎర్డొగార్ దేశరాజకీయాల్లో శక్తివంతుడుగా మారారు. ఇస్తాంబుల్ నగర మేయర్ గా, దేశప్రధాని గా పనిచేసిన ఆయన అధ్యక్షుడయ్యాక దేశరాజకీయాలను గుప్పిటపట్టారు. కానీ ఇటీవల కాలంలో ఆయనకు రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇస్తాంబుల్, దేశరాజధాని అంకారా నగర ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలైంది. రెండోసారి ఎన్నికలు జరిసినప్పటికీ ఎదురుదెబ్బలు తప్పలేదు. ఇదేసమయంలో హాజియా సోఫియా మ్యూజియాన్ని మసీదుగా మార్చాలన్న డిమాండ్లు ప్రజల నుంచి వెల్లువెత్తాయి. ఇంతకు ముందు ఎన్నికల సమయంలో ఎర్డోడాన్ ఈ డిమాండ్ ను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు కుాడా హాజియా సోఫియా మ్యుాజియాన్ని మసీదుగా మార్చాలని తీర్పు ఇచ్చింది. ఇదే అదనుగా ఎర్డోగాన్ వేగంగా పావులు కదిపారు. మ్యుాజియంలో స్వల్ప మార్పులు చేసి మసీదుగా మర్చారు. జులై 24 (శుక్రవారం) స్వయంగా ఈ మసీదులో ప్రార్ధనలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముస్లిం దేశాధినేతలను ఆహ్వానించారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు…
టర్కీ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ముందుగా క్రైస్తవ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిని మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించాయి. పోప్ ఫ్రాన్సిస్ కుాడా ఖండించారు. దీనిని ఆయన ‘ విపరీతచర్య ‘ గా పేర్కొన్నారు. అయినా టర్కీ అధినేత ఎర్డోగాన్ వైఖరిలో మార్పురాలేదు. అంతేకాక తన నిర్ణయాన్ని ఆయన బలంగా సమర్ధించుకుంటున్నారు. తమ దేశంలోని అనేక చర్చిలు, క్రైస్తవ ఇతర కట్టడాలు భద్రంగా ఉన్నాయని వెల్లడించారు. అదేసమయంలో ఐరోపా దేశాల్లో, క్రైస్తవ ఆధిక్యం గల దేశాల్లో ముస్లిం ప్రార్ధన మందిరాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయని ప్రశ్నించారు.
సమర్థించుకుంటూ…..
ఈ సమర్ధనను, ప్రశ్నలను పక్కన పెడితే ఎర్డోగాన్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో చర్చకు దారితీసింది. మత ప్రతిపదికన ఏర్పాటైన రాజ్యాలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం సహజమే అయినప్పటికి మరీ ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటీవల పాక్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణంలో ఛాందసవాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం దీనిపై కోర్టు విచారణ జరుగుతోంది. మనదేశంలోని మందిర్-మసీదు (రామజన్మభుామి-బాబ్రిమసీదు) వివాదం కుాడా దశాబ్దాల పాటు రెండు మతాల మధ్య ఉద్రిక్తతలో సృష్గించింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో సుఖాంతమైంది. మతపరమైన సున్నిత విషయాల్లో ప్రభుత్వాలు ఆచితూచి సంయమనంతో వ్యవహరించాలి. అంతేతప్ప మెజార్టీ ఉంది కదా అని ఏకపక్షంగా ముందుకువెళితే మంటలు చెలరేగుతాయి.
-ఎడిటోరియల్ డెస్క్