సంధికి ప్రయత్నం.. సక్సెస్ అవుతారా?
ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినపుడు ఇరుపక్షాల శ్రేయెాభిలాషులు రంగంలోకి దిగి వారిమధ్య రాజీ కుదర్చడం సహజం. ఘర్షణ వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించి, కలసి ఉంటే [more]
ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినపుడు ఇరుపక్షాల శ్రేయెాభిలాషులు రంగంలోకి దిగి వారిమధ్య రాజీ కుదర్చడం సహజం. ఘర్షణ వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించి, కలసి ఉంటే [more]
ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినపుడు ఇరుపక్షాల శ్రేయెాభిలాషులు రంగంలోకి దిగి వారిమధ్య రాజీ కుదర్చడం సహజం. ఘర్షణ వల్ల జరిగే అనర్ధాల గురించి వివరించి, కలసి ఉంటే కలిగే ప్రయెాజనం ఏమిటో వివరించి వారిని శాంత పరుస్తారు. ఇది వ్యక్తులు, వ్యవస్ధలు, సంస్ధలు, దేశాలకు సైతం వర్తిస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఉభయదేశాలకు కావలసిన దేశాలు రంగంలోకి దిగడం సహజం. గత నెల రోజులుగా భారత్-చైనా మధ్య ఘర్షణల వల్ల ఇరుదేశాలు ఎంతో కొంత నష్టపోయిన మాట వాస్తవం. ప్రాణ, ఆస్తి నష్టం గురించి అధికారికంగా వెల్లడించే సమాచారం కన్నా అనధికారికంగా ఎక్కువే ఉండవచ్చు. తాజాగా భారత్-చైనా మధ్య ఘర్షణలను నివారించడానికి రష్యా పూనుకుంది. ఇరుదేశాలతో దానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చైనా-రష్యాలు వామపక్ష భావజాలంతో పనిచేస్తాయి. ఉమ్మడిశత్రువైన అమెరికాను దెబ్బతీయడానికి అంతర్జాతీయ యవనికపై అవి కలసి పనిచేస్తాయి. ఇక రష్యా (ఒకప్పటి సోవియట్ యుానియన్) ఆది నుంచి భారత్ కు ఆప్త మిత్రదేశం. ఇప్పుడు అమెరికా ప్రభావం వల్ల భారత్-రష్యా మధ్య సాన్నిహిత్యం ఒకింత తగ్గినప్పటికి పునాదులు పటిష్టంగానే ఉన్నాయి.
గంగా.. ఓల్గా నదుల్లాగా…
భారత్-రష్యా సంబంధాలను ‘గంగ-ఓల్గా’ నదులతో పోలుస్తారు. రష్యాలోని ఓల్గానది, భారత్ లోని గంగా నదుల సంగమంగా ఉభయుల స్నేహసంబధాలను అభివర్ణిస్తారు. తాజాగా రష్యాలో జుాన్ 22న జరిగిన రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతల నివారణకు రష్యా కృషి చేసినట్లు సమాచారం. ఘర్షణలు కొనసాగింపునకు వ్యతిరేకంగా ఇద్దరిని మాస్కో ఒప్పించినట్లు దౌత్య వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్, చైనా, రష్యా మంత్రులు ఎస్.జైశంకర్, వాంగ్ యి, సెర్గీ లావ్రో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య తాము రాజీ కుదర్చలేదని, సరిహద్దుసమస్యను పరిష్కరించుకోగల సత్తా ఆ రెండు దేశాలకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో పైకి చెబుతున్నప్పటికీ రష్యా పాత్ర విస్మరించలేదని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రష్యా ప్రయోజానాలు కూడా….
ఇందులో రష్యా ప్రయెాజనాలు కూడా లేకపోలేదు. చైనా-భారత్ ఘర్షణలు తీవ్రమైతే అమెరికా , భారత్ మరింత సన్నిహితం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ భారత్-అమెరికా సంబధాలు రోజురోజుకి బలపడుతున్నాయి. అమెరికాకు భారత్ సన్నిహితమవడం రష్యాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అమెరికా నుంచి భారత్ ఎక్కువగా ఆయధాలను దిగుమతిచేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రష్యా ఆయుధ మార్కెట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికీ భారత్ కు రష్యా అతిపెద్ద ఆయుధ ఎగుమతిదేశంగా ఉంది. భారత్ … అమెరికాకు మరింత చేరువ అయితే భారత్-పసిఫిక్ ప్రాంతంలో రష్యా ప్రయెాజనాలకు విఘాతం కలుగుతుంది. ఈ నేపధ్యంలో వివాదాన్ని చల్లార్చేందుకు మాస్కో ముందుకు వచ్చిందని దౌత్యవేత్తలు విశ్లేషిస్తున్నారు.
అప్పట్లో కూటమిగా…..
2002 లో రష్యా, ఇండియా, చైనా కూటమి తెరపైకి వచ్చింది. వర్ధమానదేశాల ఆకాంక్షలను నెదవేర్చడంలో ఒక బహుళ ధృవ ప్రపంచాన్ని సృష్టించాలన్న ఉమ్మడి లక్ష్యం అప్పట్లో ఈ కుాటమి ఉండేది. అమెరికా విషయంలో వ్యూహాత్మక సమతుాకం పాటించడం కూడా కూటమి ఉద్దేశంగా ఉండేది. ప్రపంచ జి.డి.పి లో రష్యా, ఇండియా, చైనా కి 30 నుంచి 35 శాతం వాటా ఉంది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఎస్.సి.ఒ (షాంఘ్తె కోఆపరేషన్ కౌన్సిల్) కూటముల్లోను ఆర్.ఐ.సి కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్.ఐ.సి సదస్సు జరిగే సమయంలోనే రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ రష్యాలో పర్యటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలచి 75 ఏళ్ళయిన సందర్భంగా రష్యా నిర్వహించిన సైనిక కవాతులో భారత సైనికులు కుాడా పాల్గొన్నారు. దానికి రాజనాధ్ హాజరయ్యారు. వాస్తవానికి ఈ కవాతు మే 9 న జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది.
కొత్తేమీ కాకపోయినా….
దేశాల మధ్య రాజీలు కుదర్చడం కొత్తేమీకాదు. భారత్-పాక్ యుద్ధం సందర్భంగా 1965 లో నాటి సోవియట్ యుానియన్ రాజీ కుదిర్చింది. నాటి సోవియట్ ప్రధాని అలెక్స్ కొసిశిన్ తాష్కెంగ్ నగరంలో భారత్, పాక్ అధినేతలు లాల్ బహుదూర్ శాస్త్రి, ఆయాబ్ ఖాన్ మధ్య రాజీకుదిర్చారు. 1991 లో సోవియట్ యుానియన్ విచ్చిన్నమైన తర్వాత తాష్కెంట్ నగరం ప్రస్తుత ఉజ్జెకిస్ధాన్ దేశంలో భాగం అయింది. 1999 కార్గిల్ యుద్ధ విరమణ వెనక నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తెరవెనక కీలకపాత్ర పోషించారు. పాకిస్ధాన్ వెనక్కు తగ్గేలా ఆయన ఒత్తిడితెచ్చారు. 1971 లో బంగ్లాదేశ్ విమెాచన సందర్భంగా పాక్ తో భారత్ చేసిన యుద్ధంలో అమెరికా, సోవియట్ యూనియన్ జోక్యం చేసుకోలేదు. తటస్ధంగా ఉండిపోవడం గమనార్హం.
– ఎడిటోరియల్ డెస్క్