మంత్రులు కాకపోతేనేమి…?
ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి.. ఈ ఇద్దరూ సీనియర్ నేతలు, రాజకీయంగానూ, మంత్రిపదవులను చేజిక్కించుకోవడంలోనూ వీరు అందరికన్నా అనుభవం ఉన్నవారు. అయితే ఈ ఇద్దరు నేతలకు ఈ [more]
ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి.. ఈ ఇద్దరూ సీనియర్ నేతలు, రాజకీయంగానూ, మంత్రిపదవులను చేజిక్కించుకోవడంలోనూ వీరు అందరికన్నా అనుభవం ఉన్నవారు. అయితే ఈ ఇద్దరు నేతలకు ఈ [more]
ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి.. ఈ ఇద్దరూ సీనియర్ నేతలు, రాజకీయంగానూ, మంత్రిపదవులను చేజిక్కించుకోవడంలోనూ వీరు అందరికన్నా అనుభవం ఉన్నవారు. అయితే ఈ ఇద్దరు నేతలకు ఈ మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. రెండోదఫా మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం ఉంటుందని ఆనం, ధర్మాన ప్రసాదరావులు భావిస్తున్నారు. అందుకే సభలో గొంతులు పెద్దవి చేసి అధికార పక్షానికి అండగాల నిలుస్తున్నారు. అయితే వీరిద్దరూ మంత్రులు కాకపోయినా ప్రభుత్వంలో వీరి మాట పైచేయిగా ఉంటుందంటున్నారు.
ఆనం సలహాలను….
ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన నేత. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఘనత ఉంది. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డికి ఈసారి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆయన తొలి మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని భావించినా జిల్లాలో జూనియర్ గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రిపదవిని ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయంగా చూసుకుంటే ఆనం రామనారాయణరెడ్డికంటే జూనియర్.
అనుభవాలను తీసుకుని…..
దీంతో అనిల్ కుమార్ యాదవ్ జిల్లా పరిస్థితులు, ఇరిగేషన్ వంటి వ్యవహారాల్లో ఆనం రామనారాయణరెడ్డి సలహాలు తీసుకుంటున్నారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా ఆనం సలహాలు తీసుకుంటున్నారట. ఇలా ఆనం రామనారాయణరెడ్డి మంత్రులకు, ప్రభుత్వానికి తలలో నాలుకగా మారారంటున్నారు. ఆనం అనుభవాన్ని ఉపయోగించుకోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మంత్రులకు సూచించడంతో ఆనం హవా ప్రభుత్వంలో అనధికారికంగా నడుస్తుందని చెబుతున్నారు.
రెవెన్యూ పరంగా….
ఇక మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది కూడా సేమ్ టు సేమ్. ఆయన కూడా అనుభవమున్న నేత. సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు ఈసారి మంత్రిగా ఛాన్స్ దక్కడంతో ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఎలాంటి సమస్యలు వచ్చినా ధర్మాన ప్రసాదరావు సలహాలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ధర్మాన ప్రసాదరావుతో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సంప్రదించారు. ఇలా ఈ ఇద్దరు సీనియర్లు మంత్రులు కాకున్నా అనధికారికంగా మంత్రులుగా వ్యవహరిస్తున్నారన్నమాట.