ఇద్దరికీ అందలం… త్వరలోనేనట
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు త్వరలో దక్కనున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరిని మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రచారం [more]
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు త్వరలో దక్కనున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరిని మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రచారం [more]
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు త్వరలో దక్కనున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరిని మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరించాలనుకుంటున్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉంది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం కసరత్తులు కూడా చేసిందంటున్నారు. త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఖాయమన్న వార్తలు వెలువడుతున్నాయి.
మంత్రి వర్గ విస్తరణలో…..
అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో రెండు తెలుగు రాష్ట్రాలకు అవకాశం దక్కుతుందంటున్నారు. ప్రధానంగా రామ్ మాధవ్, మురళీధరరావులను తన మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు మోదీ రెడీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు దీర్ఘకాలంగా పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో మోదీ గెలిచిన నాటి నుంచి వీరిద్దరూ పార్టీ నాయకత్వం ఏపనిని అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేస్తూ వస్తున్నారు.
పార్టీ పదవులను అందుకే…
అందుకే ఈసారి వారికి అవకాశం కల్పించాలని మోదీ నిర్ణయించారని తెలుస్తోంది. అందుకే రామ్ మాధవ్, మురళీ ధర్ రావులను పార్టీ పదవులకు దూరంగా ఉంచారు. ఇప్పటి వరకూ వీరిద్దరూ పార్టీ జాతీయ కార్యదర్శులుగా ఉన్నారు. వారికి తిరిగి జాతీయ స్థాయి పదవులను అప్పగించలేదు. నిజానికి వీరిద్దరి సేవలు పార్టీకి అత్యంత అవసరం. వరసగా ఎన్నికలు జరుగుతుండటంతో వీరిని అక్కడ ఉపయోగించుకోవాలని కేంద్ర నాయకత్వం తొలుత నిర్ణయించిందంటున్నారు.
రెండు రాష్ట్రాలకు….
కానీ మోదీ ఆలోచనలను తెలిసిన పార్టీ నాయకత్వం వీరిని పదవులకు దూరంగా పెట్టిందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో వీరిద్దరికి మోదీ తన కేబినెట్ లో స్థానం కల్పిస్తారంటున్నారు. కేబినెట్ ర్యాంకు ఉన్న మంత్రిపదవులే వీరికి దక్కుతాయన్న ప్రచారం హస్తినలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి మోదీ మంత్రివర్గంలో ఎవరూ లేరు. రామ్ మాధవ్ ను తీసుకోవడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
- Tags
- modi
- à°®à±à°¦à±