మంచి పనిమంతుడేగా
ఉద్ధవ్ థాక్రే రాజకీయంగా కొన్ని ఏళ్లుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. ఉద్ధవ్ థాక్రే కు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పరిపాలన [more]
ఉద్ధవ్ థాక్రే రాజకీయంగా కొన్ని ఏళ్లుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. ఉద్ధవ్ థాక్రే కు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పరిపాలన [more]
ఉద్ధవ్ థాక్రే రాజకీయంగా కొన్ని ఏళ్లుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. ఉద్ధవ్ థాక్రే కు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పరిపాలన అనుభవం లేదని, ఆయన ఏకపక్ష నిర్ణయాలు కూటమిలో విభేదాలు సృష్టిస్తాయని చాలా మంది ఊహించారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ, శాఖల కేటాయింపులోనూ ఇదే రకమైన అభిప్రాయాలు అనేక మంది నుంచి విన్పించాయి. కానీ ఉద్ధవ్ థాక్రే రాటుదేలి పోయారనే అనిపిస్తుంది.
మోదీతో భేటీతో……
ప్రధాని మోదీతో భేటీ ఇందుకు కారణమనే చెప్పాలి. రాష్ట్రంలో బీజేపీ తనకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నా నేరుగా ప్రధాని మోదీని కలసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో పాటు వివిధ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించారు. నిధుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సీఏఏ విషయంలో కూడా ప్రధాని తో చర్చించి దానివల్ల ఎవరికీ ప్రమాదం లేదన్న హామీని ఉద్ధవ్ థాక్రే పొందారు.
సోనియాతో కలసి…..
ఇక తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఉద్ధవ్ థాక్రే కలసి ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. తాను ఉమ్మడి ప్రణాళికలను కట్టుబడి ఉన్నానని చెబుతూనే సీఏఏ విషయంలో మహారాష్ట్రలో ఎవరూ ఇబ్బంది పడరని కూడా సోనియాకు ఉద్ధవ్ హామీ ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల నోటికి ఉద్ధవ్ థాక్రే కళ్లెం వేయగలిగారు. ఎన్సార్సీ విషయంలో మాత్రం కఠినంగా ఉంటానని సోనియాకు చెప్పి వచ్చారు ఉద్ధవ్ థాక్రే.
ఆ ధైర్యం చేయరని…..
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయవన్న సంగతి ఉద్ధవ్ థాక్రేకు తెలియంది కాదు. ప్రభుత్వం కూలిపోతే బీజేపీ మళ్లీ హార్స్ రైడింగ్ కు పాల్పడుతోంది. అందుకే ప్రతి సమస్యను జాగ్రత్తగా డీల్ చేస్తున్నారంటున్నారు ఉద్ధవ్ థాక్రే. ఇటు కాంగ్రెస్, ఎన్సీపీల మనసు నొప్పించకుండానే తాను అనుకున్న పనిని చేయాలన్నది ఉద్ధవ్ థాక్రే ఆలోచనగా కన్పిస్తుంది. మొత్తం మీద ఉద్ధవ్ థాక్రే ఢిల్లీ పర్యటనతో అన్నీ చక్క బెట్టుకుని వచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.