ఉండవల్లి వార్నింగ్ బెల్స్
ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా రంధ్రాన్వేషణ చేసి తప్పులను ప్రజల ముందు పెట్టె పాలసీ తీసుకున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ తనయుడు [more]
ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా రంధ్రాన్వేషణ చేసి తప్పులను ప్రజల ముందు పెట్టె పాలసీ తీసుకున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ తనయుడు [more]
ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా రంధ్రాన్వేషణ చేసి తప్పులను ప్రజల ముందు పెట్టె పాలసీ తీసుకున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ తనయుడు అయినందున కొంత జగన్ పై సాఫ్ట్ కార్నర్ ఉన్నా వైసిపి చేసే తప్పులను ఎత్తిచూపుతానని నిర్మొహమాటంగా ప్రకటించేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘ విశ్లేషణే అందించారు.
వైఎస్ నేర్పిందే అది …
అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన వాగ్దానాలను జాప్యం చేయకుండా అమలు చేయాలని కాంగ్రెస్ లో ఎంపి గా వుంటూ వైఎస్సాఆర్ చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని 30 ఏళ్ళక్రితం హెచ్చరించారని గుర్తు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. స్థానిక పత్రికలో 30 ఏళ్ళనాడు శీర్షికలో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నాడు బిజెపి నేత వెంకయ్యనాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను సమర్ధించడం రాసిన వైనాన్ని ప్రస్తావిస్తూ ఇచ్చిన మాట విలువ ఎలా ఉండాలో వైఎస్ నాడే ప్రకటించారని ఇక్కడ పార్టీలను చూడకూడదని వ్యాఖ్యానించారు. వైఎస్ నాడు చేసిన వ్యాఖ్యలు రాజీవ్ గాంధీ వరకు వెళ్ళి పెద్ద పంచాయితీకే దారితీశాయన్నారు.
రాజశేఖరుని కల …
రాయలసీమ, రాజమండ్రిలలో హై కోర్ట్ బెంచ్ లు ఏర్పాటు చేయాలన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ కల అని తెలిపారు ఉండవల్లి అరుణ్ కుమార్. నాడు అందరితో సంప్రదించి ప్రజల అవసరాల రీత్యా వైఎస్ దీనికోసం ప్రయత్నం చేశారని 2006 లో జక్కంపూడి రామ్మోహన రావు మంత్రిగా ఇచ్చిన లేఖను గుర్తు చేస్తూ ఈ విషయాలను ఆధారసహితంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు అరుణ కుమార్. 14 ఏళ్ళక్రితం వైఎస్ చెప్పిన నిర్ణయాన్ని సిఎం పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. రాజమండ్రికి విమానాశ్రయం, జాతీయ రహదారి, ప్రధాన రైల్వే లైన్, జలరవాణా వంటి అన్ని సదుపాయాలూ ఉన్నాయని పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
పోలవరం పై మీ పనితీరు బాలేదు …
తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పై ఎలా వ్యవహరించిందో వైసిపి ప్రభుత్వం అదే చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అయితే ఏడాది కాలంగా పోలవరం వెబ్ సైట్ లో అప్ డేట్ లేవీ ఫీడ్ చేయకుండా స్కూల్ మూసేశారన్నారు ఉండవల్లి. పోలవరం కోసం కేంద్రం విడుదల చేసిన 1800 కోట్ల రూపాయలను ప్రాజెక్ట్ కి ఖర్చు చేయకుండా పాతబకాయిలకు రాష్ట్రం సర్దుబాటు చేసినట్లు తెలిసిందని ఇది రీ ఎంబర్స్ మెంట్ కింద కేంద్రం ఇచ్చినప్పటికీ పోలవరానికి అవి ఖర్చు పెడితే ఎపి అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశాలు ఉండేవన్నారు. ఎపి సర్కార్ పోలవరానికి ఖర్చు చేసిన 3000 వేల కోట్ల రూపాయల్లో కేంద్రం ఇచ్చిన సొమ్ములో సగానికి పైగా అలా ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పురోగతి మాటేమిటి అని ప్రశ్నించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ సొమ్మును గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ బకాయిలకు, ఆరోగ్యశ్రీ నిమిత్తం ప్రయివేట్ ఆసుపత్రిలకు బకాయిలకు చెల్లించడం జరిగినట్లు చెప్పారు. జగన్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలే కాకుండా కొత్త వరాలు ప్రకటిస్తూ వెళ్లడం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి ఎసరు తెస్తుందని హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్.
ఆయన అలా ఈయన ఇలా …
చంద్రబాబు హయాంలో ఆయనకు టాప్ ప్రయారిటీ అమరావతి అయితే జగన్ కి సంతర్పణలు టాప్ ప్రయారిటీగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం పూర్తి చేసి ఇవ్వాలిసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని, అయితే 30 వేలకోట్లరూపాయల పైగా ఖర్చు అయ్యే పునరావాస ప్యాకేజీ పై మాత్రం కేంద్రం నోరు మెదపడం లేదన్నారు ఆయన. అయితే ఇటీవల ఆరేళ్ళ తరువాత టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో తన గళం వినిపిస్తే రాజమండ్రి ఎంపీ కూడా దీనిపై కేంద్రాన్ని నిలదీస్తే సరైన సమాధానమే రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. పునరావాస ప్యాకేజీ అమలు చేస్తే కానీ డ్యామ్ కట్టి నీళ్ళు నిల్వ చేసే అవకాశం లేదని అలాంటప్పుడు దీనిపై రాష్ట్రం లోని అధికారవిపక్షాలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలిసిన సమయం ఆసన్నం అయిందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ వ్యవహారంపై ఏపీ ప్రయోజనాలకోసం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు సుప్రీం కోర్ట్ లో వేసిన వాజ్యానికి అఫిడవిట్ దాఖలు చేయమని గత టిడిపి ప్రభుత్వ హయాంలో వేడుకున్నా పని జరగలేదని కనీసం జగన్ సర్కార్ అయినా దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇసుకలో, మద్యం లో అడ్డంగా ఫెయిల్…
ఇసుక, మద్యం పాలసీలలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శించారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రి నుంచి కాక కొవ్వూరు నుంచి ఇసుక సరఫరా జరగడం రేవులన్ని మూసివేయడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. నిజాయితీగా వుండాలని జగన్ ఒక్కరు అనుకుంటే పని జరగదని పాతుకుపోయిన అవినీతి వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి కృషి చేయాలని కోరారు. మద్యం పాలసీ మరీ చిత్రంగా ఉందని ప్రభుత్వ మద్యం దుకాణానికి, బార్లకు ఇస్తున్న ధరలు అవినీతిని పెంచి పోషిస్తున్నాయన్నారు. మద్యం పాలసీ సక్రమంగా లేకపోవడంతో నాటు సారా రక్కసి ఇప్పుడిప్పుడే మొదలు అవుతున్నట్లు ప్రచారం జరుగుతుందని ఇది కానీ మొదలైతే ఆపడం ప్రభుత్వ యంత్రాంగానికి సాధ్యం కాదని తగిన సిబ్బంది లేకపోవడంతో అనేక ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని గత చరిత్రను ఉటంకించారు ఉండవల్లి అరుణ్ కుమార్.
పోలవరంపై ఉండవల్లి ప్రశ్నల పరంపర …
కేంద్రం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరంపై ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ లు కోర్ట్ కెక్కడం ఏమిటని ప్రశ్నించారు ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం పై ఈ సందర్భంగా 12 ప్రశ్నలను సంధించారు ఆయన. పోలవరం పై నిర్దిష్ట ప్రణాళిక లేదని, ప్రతిపక్షంలో వున్నప్పుడు కేంద్రం చేపట్టాలని కోరిన వైసిపి అధికారం చేపట్టాకా తామే చేపట్టడం దేనికని, గతంలో వైఎస్, రోశయ్య ప్రభుత్వాల్లో ఖర్చును కేంద్రం కోరినప్పుడు ఆ లెక్కలు ఎందుకు ఇవ్వడం లేదని, ప్రాజెక్ట్ పనుల్లో పారదర్శకత ఎందుకు పాటించడం లేదని, ఏడాదిగా ఎందుకు పోలవరం వెబ్ సైట్ అప్ లోడ్ కి నోచుకోలేదని, ఎక్స్పర్ట్ కమిటీ, డ్యామ్ కమిటీ రివ్యూస్ ఎందుకు వెబ్ సైట్ లో పెట్టడం లేదని, ప్రాజెక్ట్ కాస్ట్ రివైజ్డ్ పై మూడేళ్ళుగా కేంద్రం మౌనం వహిస్తే ఎందుకు నిలదీయడం లేదని, జగన్ సర్కార్ కి ప్రశ్నలు సంధించారు ఉండవల్లి అరుణ్ కుమార్.