పిరికితనం వద్దు జగన్
విభజన లో హైదరాబాద్ పోయినా పోలవరం వచ్చిందని ఆంధ్రులు సంబరపడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. వైఎస్ మొదలు పెట్టిన పోలవరాన్ని జగన్ [more]
విభజన లో హైదరాబాద్ పోయినా పోలవరం వచ్చిందని ఆంధ్రులు సంబరపడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. వైఎస్ మొదలు పెట్టిన పోలవరాన్ని జగన్ [more]
విభజన లో హైదరాబాద్ పోయినా పోలవరం వచ్చిందని ఆంధ్రులు సంబరపడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. వైఎస్ మొదలు పెట్టిన పోలవరాన్ని జగన్ పూర్తి చేస్తారనే విశ్వాసంతో ప్రజలు గెలిపించారన్నారు. వైసిపి కి అఖండ మెజారిటీ కి ఈ కారణం కూడా ఉందని మరిచిపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ దెబ్బతింటారని హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. 22 మంది ఎంపీలు ఉన్నా 540 మందిలో కనిపించే స్థాయి కాదని కానీ చట్ట ప్రకారం కేంద్రం చేసి తీరాలిసిన అంశాల్లో గట్టిగా పోరాడి సాధించుకోవాలని చెప్పారు ఉండవల్లి. గతంలో జ్యోతిబసు బెంగాల్ సిఎం గా రికార్డ్ స్థాయిలో పనిచేశారన్నా ఇందిరాగాంధీ కొనసాగరన్నా చట్టాలపై వారికి ఉన్న అవగాహనా వ్యూహాలే వారిని పవర్ ఫుల్ లీడర్స్ గా నిలబెట్టాయన్నారు.
ఆర్ధిక స్థితి భయపెడుతుంది …
ఏపీ బడ్జెట్ చూశాకా ఆర్ధిక పరిస్థితి పై మాట్లాడతానని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ప్రస్తుతం సంక్షేమ దిశగా లెక్కా పత్రం లేకుండా సర్కార్ దూసుకుపోతున్న తీరు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. జాతీయ స్థాయిలో జిడిపి 4 శాతానికి పడిపోయిన నేపథ్యంలో, బంగ్లా దేశ్ కన్నా తక్కువ దేశ జిడిపి దిగజారుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అడుగులు జాగ్రత్తగా వేయాలని సూచించారు ఉండవల్లి అరుణ్ కుమార్.
త్వరలో జగన్ సర్కార్ పై ఛార్జ్ షీట్ …
ప్రభుత్వాల తప్పులు ఎన్నడమే తనపని అని త్వరలో జగన్ సర్కార్ పై కూడా ఛార్జ్ షీట్ ఇస్తా అని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఒక సామాన్యుడిగా నిలదీసే హక్కు తనకు ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రచార మాధ్యమాలుగా చెప్పే ఛానెల్స్ పత్రికలు సైతం తన మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మీడియా చూపించినంత కాలం ప్రజల ముందుకు వస్తానని అన్నారు ఉండవల్లి. జగన్ సర్కార్ మీడియా పై సాగిస్తున్న అణచివేత వైఖరి ని తీవ్రంగా తప్పుపట్టారు మాజీ ఎంపీ. ప్రభుత్వం దేనికి భయపడాలని తప్పులు చేయనప్పుడు మీడియా పై ఆంక్షలు విధించడం దేనికని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఛానెల్స్ ప్రసారాలు నిలిపి వేస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు. ఇదే రీతిలో కెసిఆర్ తెలంగాణాలో, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరించారని గుర్తు చేశారు.
పిరికితనం బయల్దేరింది …
గతంలో వైఎస్సార్ కు వ్యతిరేకంగా మొత్తం టిడిపి మీడియా నిత్యం దాడి చేస్తున్నా ఆయన ఏనాడు ఆంక్షలు పెట్టలేదన్నారు. ఆ రెండు పత్రికలు, ఛానెల్స్ అంటూ విమర్శించేవారు కానీ ఇలాంటి ధోరణి లేదన్నారు. విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమని, విమర్శకు భయపడుతున్నారు అంటే పిరికితనం మీలో ప్రవేశించినట్లే అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు సోషల్ మీడియా విస్తరించిందని దీన్ని నిరోధించడం ఎవరివల్ల కాదన్నారు. నాడు వైఎస్ కు లభించిన వ్యతిరేక ప్రచారానికి కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవాలని, కానీ మీరేంటి మీ పనితీరు ఏమిటి అన్నది ప్రజలు మీడియా ను బట్టి గమనించారని క్షేత్ర స్థాయిలో పనితీరు ను బట్టి నిర్ణయించుకుంటారని చెప్పారు ఉండవల్లి. మీడియా పై ఆధారపడాలిసింది రూలింగ్ పార్టీ నే అని దానికి నిర్బంధం ప్రమాదమని తెలిపారు. తాను చేసేది రైట్ అని తొడగొట్టాలని ఏమి రాసుకుంటారో రాసుకోండని సవాల్ చేయాలి తప్ప ఈ రూట్ కరెక్ట్ కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
ఐటి రైడ్స్ ఆ రెండు పార్టీల సబ్జెక్ట్ …
ఏపీ లో నడుస్తున్న ఐటి రైడ్స్ వ్యవహారం టిడిపి, వైసిపి ల విమర్శలు ఆరోపణలకు సంబంధించిన వ్యవహారమన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏ పార్టీ కూడా తమ జేబులోనుంచి ఓటుకు రెండువేలరూపాయాలు ఇవ్వలేదని ప్రజల సొమ్ము లూటీ చేసే ఇవ్వాలన్నారు. చంద్రబాబును మోడీ టార్గెట్ చేశారని అయితే బాబు బయట పడే మార్గాలు ఆయనకు తెలుసన్నారు. సుజనాచౌదరి ని ఇప్పటివరకు ఏ పార్టీ ఏమీ చేసిందేమి లేకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. మోడీ కక్ష గడితే ఎంతకైనా తెగిస్తారని 30 ఏళ్ళక్రితం తప్పు చేశారంటూ ఇటీవల సంజీవ్ భట్ అనే పోలీస్ అధికారిని జైల్లో పెట్టించారని, కాశ్మీర్ భారత్ లో ఉండటానికి కారణమైన ఫరూక్, ఒమర్ అబ్దుల్లా వంటి కుటుంబాన్ని గృహనిర్బంధం చేశారని ఆయన చర్యలు ఇలాగే ఉంటాయన్నారు. ఇప్పుడు దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తున్నారని గుజరాత్ లో పేదరికాన్ని గోడలు కట్టి కనిపించకుండా చేస్తున్నారన్నారు.
ఆప్ విజయం ఢిల్లీ ఓటర్ల విజ్ఞతే …
ఢిల్లీ లో ఓటర్లు విజ్ఞులు కావడంతో తమకు కావలిసిన ఆప్ ను ఎన్నుకున్నారని విశ్లేషించారు ఉండవల్లి. దేశంలో ఇప్పటివరకు మోడీని ఢీకొట్టే నేత లేరని విపక్షాల అనైక్యత ఆయన బలంగా ఉండటంతో కేంద్రంలో బిజెపి హవా నడుస్తుందన్నారు. అయితే చరిత్ర ఎప్పుడు ఒకలా ఉండదని మోడీ ని ఎదిరించే నేత వస్తారని జోస్యం చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆర్ఎస్ఎష్ కార్యకర్త గా ఉన్న మోడీని ముఖ్యమంత్రిని చేస్తే గుజరాత్ లో నరమేధం సృష్ట్టించి బోర్డర్ లో వుండే భావోద్వేగాలను ఆయన చక్కగా ఉపయోగించుకుని ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. మోడీతో ఎపి ముఖ్యమంత్రి జగన్ భేటీ పై మాట్లాడుతూ రాష్ట్రం కోసం ఆయన చర్చించి ఉంటే ప్రయోజనం ఉంటుందని, కేసుల కోసమే జగన్ చర్చించి ఉంటే బలహీనపడతారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. జైలు కి అయినా వెళ్లేందుకు సిద్ధం అని ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం కోసం జగన్ మోడీకి ఎదురొడ్డి సవాల్ చేస్తే మాత్రం ఆయనకు తిరుగులేదని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.