వెరీ వెరీ స్పెషల్ ఉండవల్లి శ్రీదేవి… ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తొలి నుంచి ఉండవల్లి శ్రీదేవి వివాదాలకు కేరాఫ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తొలి నుంచి ఉండవల్లి శ్రీదేవి వివాదాలకు కేరాఫ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తొలి నుంచి ఉండవల్లి శ్రీదేవి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. జగన్ సతీమణి భారతి సిఫార్సుతో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గ టిక్కెట్ ను దక్కంచుకున్నారంటారు. అందుకే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చెలరేగి పోతున్నారన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.
15 నెలల్లో ఎన్నో వివాదాలు……
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు కావస్తుంది. ఈ పదిహేను నెలల్లో ఉండవల్లి శ్రీదేవి ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. తొలుత తన పార్టీకి చెందిన ఎంపీ నందిగం సురేష్ తో పొసగలేదు. ఇద్దరి మధ్య ఇసుక తవ్వకాల వివాదం తలెత్తింది. దీనిపై అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అలాగే క్రషర్ల విషయంలోనూ ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలను ఎదుర్కొన్నారు. క్రషర్ల యజమానుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వైసీపీ నేతల నుంచే వచ్చాయి.
గెలిచిన తొలి నాళ్లలోనే…..
ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే నియోజకవర్గానికి చెందిన ఓ యువజన నేత పార్టీకి రాజీనామా చేయడంతో పాటు శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీ వర్గాల్లోనే సంచలనంగా మారింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఉండవల్లి శ్రీదేవి పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టేసి ఓసీలు, బీసీలు, ఎస్సీలు అంటూ విభజించి మరీ రేట్లు పెట్టి బేరసారాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు జిల్లా పార్టీలో అప్పట్లో రగడకు దారి తీశాయి.
వైసీపీ నేతల నుంచే….
ఇక ఇటీవల పేకాట క్లబ్ విషయంలోనూ ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. అయితే తనకు సంబంధం లేదని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. కాగా ఇప్పుడు ఎన్నికల సమయంలో తన వద్ద నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని వైసీపీ నేత మేకల రవి ఫిర్యాదు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన వద్ద నుంచి 1.40 కోట్ల రూపాయలు తీసుకుందని, 40 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే పోలీసులతో ఉండవల్లి శ్రీదేవి బెదిరిస్తున్నారని మేకల రవి చెబుతున్నారు. పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు రావడంతో అధిష్టానానికి కూడా ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం తలనొప్పిగా మారింది. మరి జగన్ ఎలా కట్టడి చేస్తారో చూడాలి.