ఎమ్మెల్యే శ్రీదేవిని టార్గెట్ చేసింది ఎవరు…? ఆయనేనా?
వైసీపీ ఎమ్మెల్యే.. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి.. పోలీసు అధికారిపై ( సర్కిల్ ఇన్స్పెక్టర్ ) దూషణలు చేశారని, నాకాళ్లు పట్టుకుని పోస్టింగు తెచ్చుకున్నావు.. నీ సంగతి తేలుస్తా.. [more]
వైసీపీ ఎమ్మెల్యే.. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి.. పోలీసు అధికారిపై ( సర్కిల్ ఇన్స్పెక్టర్ ) దూషణలు చేశారని, నాకాళ్లు పట్టుకుని పోస్టింగు తెచ్చుకున్నావు.. నీ సంగతి తేలుస్తా.. [more]
వైసీపీ ఎమ్మెల్యే.. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి.. పోలీసు అధికారిపై ( సర్కిల్ ఇన్స్పెక్టర్ ) దూషణలు చేశారని, నాకాళ్లు పట్టుకుని పోస్టింగు తెచ్చుకున్నావు.. నీ సంగతి తేలుస్తా.. అన్నారని.. జగన్ పాలనలో.. నేతలు అందరూ ఇలానే ఉన్నారని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, నిజానికి ఉండవల్లి శ్రీదేవి చేసిన ఆ వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే.. అవి ఇప్పటివి కావని.. ఆమె ఎప్పుడో గతంలో చేసిన వ్యాఖ్యలని.. అప్పట్లో ఆ విషయంపై సంజాయిషీ ఇచ్చుకోవడం.. సమస్య సమసి పోవడం కూడా జరిగిందని.. వైసీపీ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
పార్టీ నేతల నుంచే…
ఇక వారం రోజుల క్రితమే వైసీపీకి చెందిన ఓ నేత తనకు ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల కోసం తీసుకున్న సొమ్ములో రు. 80 లక్షలు ఇవ్వాలని.. ఈ అమౌంట్ అడిగితే డీసీసీబీ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలనడంతో పాటు ఆమె భర్త బెదిరిస్తున్నాడని కూడా ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా ఉండవల్లి శ్రీదేవి పై సొంత పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పాతవి, కొత్తవి అన్ని కలిపి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉండవల్లి శ్రీదేవి ని బద్నాం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? రాజధానిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. మూడు రాజధానులకు జైకొడుతున్న కారణంగా.. ఆమెను ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించాలి.
ఆయనేనా?
ఒకవేళ వ్యతిరేకించినా.. ఇలా తప్పుడు ప్రచారానికి దిగుతారని అనుకోలేం.. అంటున్నారు వైసీపీ నేతలే. అయితే, ఈ క్రమంలో వారి దృష్టి.. మాజీ మంత్రి.. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌పై పడింది. ఆయన తాడికొండ నియోజకవర్గానికి చెందిన నాయకుడు. గతంలో రెండుసార్లు ఆయన ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. గత ఏడాది ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, చంద్రబాబు ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో ఆయన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. ఆయన మనసంతా కూడా తాడికొండపై ఉందట.
వచ్చే ఎన్నికల నాటికి….?
వచ్చే ఎన్నికల్లో అయినా తనకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యతిరేక వర్గాన్ని డొక్కా చేరదీయడంతో పాటు ఆమెపై వస్తోన్న ఆరోపణలు బయటకు వచ్చేలా తనదైన స్టైల్లో చక్రం తిప్పుతున్నారన్న గుసగసలు గుంటూరు రాజకీయాల్ల వినిపిస్తున్నాయి. ఉండవల్లి శ్రీదేవి పై కేడర్‌లో వ్యతిరేకత పెరిగిపోతే సహజంగానే జగన్‌తో ఆమెను తప్పించడం ద్వారా తనకు మార్గం సుగమం అవుతుందని మాణిక్యం భావిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగని ఉండవల్లి శ్రీదేవి పై వ్యతిరేకత లేదని కాదు.. ఆమెపై ఇప్పటికే సొంత పార్టీ కేడర్‌తో పాటు నియోజకవర్గ ప్రజల్లోనూ వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు. అటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, వైసీపీ సీనియర్లతోనూ ఆమెకు పొసగడం లేదు.