“నాడి” తెలియకేనా…?
రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఒకసారి ఎమ్మెల్యే అయిన వెంటనే వారు తమకు తిరుగులేదనుకుంటారు. తనను చూసే ప్రజలు గెలిపించారని భ్రమపడుతుంటారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక్కసారికి మాత్రమే ప్రజలు [more]
రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఒకసారి ఎమ్మెల్యే అయిన వెంటనే వారు తమకు తిరుగులేదనుకుంటారు. తనను చూసే ప్రజలు గెలిపించారని భ్రమపడుతుంటారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక్కసారికి మాత్రమే ప్రజలు [more]
రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఒకసారి ఎమ్మెల్యే అయిన వెంటనే వారు తమకు తిరుగులేదనుకుంటారు. తనను చూసే ప్రజలు గెలిపించారని భ్రమపడుతుంటారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక్కసారికి మాత్రమే ప్రజలు ఛాన్స్ ఇస్తారని వారు ఐదేళ్లపాటు గ్రహించారు. కొన్ని దశాబ్దాలుగా వన్ టైమ్ ఎమ్మెల్యేలు అయి స్యయంకృతంతో మాజీలుగా నేటికీ మిగిలిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి జాబితాలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేరబోతున్నారు. ఆమె డాక్టర్ అయినా నాడిచూసి వైద్యం చేసినా, ప్రజల నాడిని పట్టుకోవడంలో ఫెయిలయ్యారు.
రికమెండేషన్ తో…..
ఉండవల్లి శ్రీదేవి ఎక్కడో హైదరాబాద్ లో వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఉండవల్లి శ్రీదేవి వైఎస్ జగన్ సతీమణి భారతి స్నేహితురాలు కావడంతో ఆమెకు టిక్కెట్ సులువుగానే లభించింది. వైద్య వృత్తిలో నాలుగు రాళ్లు వెనకేసుకున్న ఉండవల్లి శ్రీదేవి రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న తాడికొండ నియోజకవర్గం వైసీపీ టిక్కెట్ ను సులువగానే దక్కించుకున్నారు. ఇక రాష్ట్రమంతటా వీచిన జగన్ గాలిలో శ్రీదేవి కూడా విజయం సాధించారు.
భ్రమలో మునిగిపోయి…..
తొలిసారి గెలవడంతో ఆ గెలుపంతా తనదేనన్న భ్రమలో ఉన్నారు ఉండవల్లి శ్రీదేవి. ఐదు నెలల కాలంలో ఎన్నో వివాదాలు. సహచర పార్టీ సభ్యులతో గొడవలు. ఎంపీ నందిగం సురేష్ తో ఘర్షణ. ఇలా ఒక్కటేమిటి.. పక్కనే ఉండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తలనొప్పిగా తయారయ్యారు. ఆమె రాజకీయాల ముందు నుంచి పార్టీలో ఉంటున్న వారిని కూడా పదవుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తుళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడిని తొలగించాల్సిందిగా ఉండవల్లి శ్రీదేవి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లేఖ కూడా రాశారు. దీంతో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ఎస్సీ కాదంటూ…..
దీనికి తోడు రిజర్వ్ డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదన్న వాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని చెప్పిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఉండవల్లి శ్రీదేవి తన భర్తది కాపు సామాజికవర్గమని, తాను ఎస్సీనని చెప్పి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఇక చివరకు రాష్ట్రపతి వద్దకు ఈ వివాదం చేరుకుంది. రాష్ట్రపతి కూడా దీనిపై విచారణ చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వరస వివాదాలతో ఉన్న ఉండవల్లి శ్రీదేవికి ఇటు సొంతపార్టీ నేతలు కూడా ప్రత్యర్థులుగా మారారు. దీంతో ఆమె వన్ టైమ్ ఎమ్మెల్యే అన్న టాక్ పార్టీలోనే నడుస్తోంది.