అడుగుపెట్టనేల…? ఓట్లు అడగనేల? లైట్ తీస్కుంటున్నారా?
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టుగా.. ఉంది గుంటూరు జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి పరిస్థితి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ఇక్కడ [more]
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టుగా.. ఉంది గుంటూరు జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి పరిస్థితి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ఇక్కడ [more]
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టుగా.. ఉంది గుంటూరు జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి పరిస్థితి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ఇక్కడ విజయం సాధించారు. అయితే, అప్పట్లో అందరినీ ఆమె కలుపుకొని పోయారు. అయితే, వృత్తి రీత్యా తాను డాక్టర్ కావడంతో నెలలో పదిహేను రోజుల పాటు హైదరాబాద్లోనే ఉంటున్నారు. దీంతో నియోజకవర్గానికి ఆమెకు మధ్య అనుబంధం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. మరీముఖ్యంగా నాయకులతో ఆమె కలిసికట్టుగా సాగడం లేదనే అపవాదు కూడా ఉంది. పైగా ఆమెకు నోటి దురుసు కూడా ఉండడంతో నాయకులు ఆమెతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు.
రాజధాని ఉద్యమంతో…..
ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్నా ఆమెపై రకరకాల ఆరోపణలు వచ్చేశాయి. ఓ వైపు అటు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతో.. ఇటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో తీవ్రమైన గ్యాప్ ఉంది. ఇక నియోజకవర్గంలో చందాలు వసూలు చేస్తున్నారని.. లంచాలు తీసుకుంటున్నారని కూడా ఆమె తీరు నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఆమె ఎస్సీ కాదన్నది కూడా వివాదమైంది. ఇక రాజధాని ఉద్యమం తాడికొండలో తీవ్రంగా ఉన్నా ఆమె పూర్తిగా చేతులు ఎత్తేశారు. రాజధాని గ్రామాల్లో తిరిగే సాహసం కూడా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తెరమీదికి వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె ఎలా విజయం సాధిస్తారు? జగన్ విధించిన షరతును ఎలా సక్సెస్ చేస్తారు ? అనేది కీలకంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికలతో…
ఈ నెలలో నిర్వహించే స్థానిక ఎన్నికలకు అప్పుడే నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది స్థానికంగా మేం ఆమెను గెలిపించాం. కానీ, మా కష్టాలు వినేందుకు మాత్రం ఆమె ముందుకు రావడం లేదు.. అని ఇప్పటికే ఇక్కడి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. గత మూడు నెలలుగా ఈ ఉద్యమం జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే ఇప్పటి వరకు ముందుకు రాలేదు. కానీ, ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఏర్పడింది.
ఉక్కిరి బిక్కిరి అవుతూ…
అదే సమయంలో స్థానికంగా నాయకులతోను కలిసి పనిచేయాల్సి వస్తోంది. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పార్టీ నాయకత్వం కూడా ఆమె వ్యవహార శైలీపై భగ్గుమంటోంది. ఈ క్రమంలో శ్రీదేవికి ఇబ్బందులు మొదలయ్యాయని అంటున్నారు పరిశీలకులు. అసలే ఆమె దూకుడు, దుందుడుకు తనం మైనస్ అంటే… ఇప్పుడు రాజధాని ఉద్యమ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆమె తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాను ఒకటి తలిస్తే.. జగన్ మరొకటి తలిచారని ఆమె వాపోతున్నట్టు చెబుతున్నారు.
పార్టీని గెలిపించడం….
ఇప్పటి వరకు తనపై ఉన్న వ్యతిరేకతను భేరీజు వేసుకుంటే.. అందరినీ కలుపుకొని ముందుకు సాగడం కష్టమే. పైగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. స్థానిక ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా చెప్పడంతో శ్రీదేవికి అసలు సిసలు అగ్నిపరీక్ష స్టార్ట్ అయ్యింది. నియోజకవర్గంలో తుళ్లూరు మండలం మినహా మిగిలిన మూడు మండలాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడున్న వ్యతిరేకతను అధిగమించి తన నియోజకవర్గంలో పార్టీని గెలిపించడం శ్రీదేవికి సవాల్ లాంటిదే.