మంచి నిర్ణయమే అవుతుందా?
కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. మోదీని ఢీకొట్టాలంటే బీజేపీ యేతర పార్టీలను సమన్వయం చేసుకునే నేత కావాలి. కాంగ్రెస్ కు అనుకూలంగా అనేక పార్టీలు [more]
కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. మోదీని ఢీకొట్టాలంటే బీజేపీ యేతర పార్టీలను సమన్వయం చేసుకునే నేత కావాలి. కాంగ్రెస్ కు అనుకూలంగా అనేక పార్టీలు [more]
కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. మోదీని ఢీకొట్టాలంటే బీజేపీ యేతర పార్టీలను సమన్వయం చేసుకునే నేత కావాలి. కాంగ్రెస్ కు అనుకూలంగా అనేక పార్టీలు ఉన్నా నాయకత్వం లేమితో అవి పెద్దగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూపీఏకు ఇప్పుడు శరద్ పవార్ ను ఛైర్మన్ గా నియమించాలని ఆలోచన కాంగ్రెస్ కు రావడం మంచి పరిణామమే అని అంటున్నారు.
సోనియా వల్ల…..
సోనియా గాంధీ గత కొన్నేళ్లుగా యూపీఏ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె సారథ్యంలో రెండుసార్లు కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే సోనియా గాంధీ గతకొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మొన్న లోక్ సభ ఎన్నికల్లోనూ సోనియా ప్రచారానికి దూరంగా ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను సమన్వయం చేసుకునే సమయం ఆమెకు లేకపోయింది. దీంతోనే యూపీఏ ఛైర్మన్ గా శరద్ పవార్ ను నియమించాలని భావిస్తున్నారు.
రాహుల్ వయసు కూడా….
నిజానికి కాంగ్రెస్ అధ్యక్షులే యూపీఏకు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. జాతీయ పార్టీ కావడం, గాంధీ కుటుంబం పట్ల ఆదరణ ఉండటంతో మిగిలిన పార్టీలు దీనికి అంగీకరిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు కొన్ని పార్టీలు ఇష్టపడటం లేదు. రాహుల్ వయసు కూడా అందుకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో యూపీఏ ఛైర్మన్ గా శరద్ పవార్ ను నియమయిస్తే అన్ని పార్టీలు సమిష్టిగా పనిచేస్తాయని భావిస్తున్నారు.
కరెక్ట్ నిర్ణయమే…..
శరద్ పవార్ సీనియర్ రాజకీయ వేత్త. ఆయన పేరు రాష్ట్రపతి, ప్రధాని పదవి కి కూడా విన్పించింది. అయితే మరాఠా నేతకి కాలం కలసి రాలేదు. అయితే బీజేపీయేతర పార్టీలను ఒక్కటిగా చేయగల సత్తా శరద్ పవార్ కు ఉందని చెబుతున్నారు. ఆయనకున్న అనుభవం, సీనియారిటీ, వయసు ఇందుకు ఉపకరిస్తాయని అంటున్నారు. మొత్తం మీద శరద్ పవార్ ను యూపీఏ ఛైర్మన్ గా నియమిస్తే మోదీకి కొంత ధీటైన నేతను ప్రజల ముందు ఉంచినట్లే అవుతుందని చెప్పక తప్పదు.