రాజకీయ వైభోగమే… ఇక అంతా సాకారమే
కొత్త జిల్లాలు కనుక వస్తే ఉత్తరాంధ్ర మరింత ఫొకస్ అవుతుంది అన్న మాట వినిపిస్తోంది. నిజానికి విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలతోనే ఉత్తరాంధ్ర ఇపుడు రాజకీయంగా [more]
కొత్త జిల్లాలు కనుక వస్తే ఉత్తరాంధ్ర మరింత ఫొకస్ అవుతుంది అన్న మాట వినిపిస్తోంది. నిజానికి విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలతోనే ఉత్తరాంధ్ర ఇపుడు రాజకీయంగా [more]
కొత్త జిల్లాలు కనుక వస్తే ఉత్తరాంధ్ర మరింత ఫొకస్ అవుతుంది అన్న మాట వినిపిస్తోంది. నిజానికి విశాఖను రాజధానిగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలతోనే ఉత్తరాంధ్ర ఇపుడు రాజకీయంగా కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా కూడా తమ యాక్టివిటీస్ ని మాత్రం విశాఖ కేంద్రంగా చేయాలనుకుంటున్నాయి. తమ పార్టీ రధ సారధులను ఈ ప్రాంతాలకు చెందిన వారి నుంచే ఎంపిక చేయాలనుకుంటున్నాయి. ఇక విశాఖ రాజధాని అన్నది దాదాపుగా సాకారం అవుతుందనే అంతా అంటున్న వేళ కొత్త జిల్లాలతో ఉత్తరాంధ్ర మరింతగా రాజకీయ వైభోగం సంతరించుకుంటుంది అంటున్నారు.
అరకు వన్ బై టూ…
ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వైసీపీ సర్కార్ పచ్చ జెండా ఊపేసింది. పార్లమెంట్ సీట్ల ప్రాతికన కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే మూడు జిల్లాల ఉత్తరాంధ్ర అయిదు జిల్లాలు అవుతుంది. అయితే అరకు భౌగళిక పరిస్థితుల రీత్యా నాలుగు జిల్లాలకు విస్తరించి ఉంది. విశాఖతో పాటు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల వరకూ అరకు విస్తరించి ఉంది. ఇక పైగా అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది. దాంతో అరకుని రెండుగా విడగొట్టాలని ఏకంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి జగన్ కి సిఫార్స్ చేశారు. దాంతో అరకును రెండుగా చేసేందుకు అవకాశాలు చూడమని జగన్ ఆదేశించారు.
ఆమెదే హవా …
దీంతో అరకు రెండుగా మారితే ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం ఆరు అవుతాయన్నమాట. ఇక అరకు జిల్లాతో పాటు రాబోయే కొత్త జిల్లా ఏది వస్తుంది అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఇప్పటికే పార్వతీపురం జిల్లాగా చేయమని సంతకాల సేకరణ జరుగుతోంది. ఆ ఉద్దేశ్యంతోనే కురుపాం ఎమ్మెల్యేగా ఉన్న పుష్ప శ్రీవాణి రెండు జిల్లాల ప్రతిపాదన తెచ్చారని అంటున్నారు. పార్వతీపురం పక్కనే కురుపాం ఉంది. కొత్త గిరిజన జిల్లాను సాధిస్తే పుష్ప శ్రీవాణి హవా బాగా పెరుగుతుంది. రాజకీయ పలుకుబడి పెంచుకోవడంతో పాటు వైసీకీకి కూడా పట్టు పెంచేలాగానే ఉప ముఖ్యమంత్రి ఈ కొత్త ప్రతిపాదన చేశారని అంటున్నారు.
అక్కడ అలా …?
ఇక మరో వైపు చూసుకుంటే శ్రీకాకుళంలోని పాలకొండను కొత్త గిరిజన జిల్లాగా చేయమని ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. దాని వెనక కూడా రాజకీయ పెద్దలు ఉన్నారు. దాంతో కొత్త గిరిజన జిల్లాగా ఈ రెండింటిలో ఏది అవుతుందన్నది పెద్ద చర్చగా ఉంది. వీటిలో ఒకటి చేసి రెండవది చేయకపోయినా ఇబ్బందే. దాంతో ఈ రాజకీయ ఆధిపత్య పోరులో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైసీపీ నేతల్లో ఎవరు నెగ్గుతారో చూడాలి. అయితే ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం కూడా అరకు పరిధిలో వస్తుంది. దాంతో ఆయా ప్రాంతాలను కలుపుతూ అక్కడే కొత్త గిరిజన జిల్లా తెస్తే ఈ రెండూ కూడా సైడ్ అయిపోతాయని అంటున్నారు. చూడాలి ఏది ఎలా చేసినా కూడా రాజకీయ రచ్చ మాత్రం ఉత్తరాంధ్రలో తప్పేట్లు లేదు.