ఎంత చేస్తున్నా కలసి రావడంలేదే? మళ్లీ మారాలా?
“ మేం వద్దన్నా..ఆమెను మా నెత్తిన రుద్దుతున్నారు?! “-ఇదీ ఇప్పుడు విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాయకరావుపేటలో టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నియోజకవర్గానికి [more]
“ మేం వద్దన్నా..ఆమెను మా నెత్తిన రుద్దుతున్నారు?! “-ఇదీ ఇప్పుడు విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాయకరావుపేటలో టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నియోజకవర్గానికి [more]
“ మేం వద్దన్నా..ఆమెను మా నెత్తిన రుద్దుతున్నారు?! “-ఇదీ ఇప్పుడు విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాయకరావుపేటలో టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా.. విజయం సాధిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే పార్టీ ఇక్కడ ఓడిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక గాలులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ… వచ్చింది. 2009, 2012 ఉప ఎన్నిక సహా 2019లో రెండు సార్లు కూడా గొల్ల బాబూ రావు.. ఇక్కడ టీడీపీని మట్టికరిపించారు. నిజానికి టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో 2009లో పార్టీ ఓటమి కలవరపరచక పోయినా.. 2019లో మాత్రం పార్టీ ఇక్కడ ఓడిపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి.
టీడీపీ క్యాడరే…?
దీనికి ప్రధానంగా 2014లో ఇక్కడ నుంచి వంగలపూడి అనిత విజయం సాధించారు. గతంలో ప్రభుత్వ టీచర్‌గా ఉన్న ఆమెను చంద్రబాబు తీసుకువచ్చి.. ఇక్కడ టికెట్ ఇచ్చిపోటీకి పెట్టారు. ఈ క్రమంలో విజయం సాధించిన అనిత.. నియోజకవర్గంలో విజిటింగ్ గెస్ట్‌గా మారిపోయారనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, పార్టీలోనూ ఎవరినీ కలుపుకొని ముందుకు సాగలేదనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. నిజానికి గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో నియోజకవర్గానికి చాలా నిధులు వచ్చాయి. అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అప్పటి జిల్లా మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాసరావులతో ఉన్న పరిచయాల నేపథ్యంలో నిధులు రాబట్టినా నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఆమెకు సీటు ఇస్తే ఓడిస్తామని టీడీపీ కేడరే శపథం చేసే వరకు వెళ్లిపోయింది.
తీవ్ర వ్యతిరేకతతో…..
వ్యక్తిగా అనిత వ్యవహరించిన తీరు ఇక్కడ టీడీపీ వ్యవస్థను ఇబ్బంది పెట్టింది. అయితే అసెంబ్లీలో కాస్త బలమైన వాయిస్ వినిపించడం.. అటు వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజాతో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో వ్యవహరించడంతో చంద్రబాబు ఆమె ఎలాగైనా అసెంబ్లీలో ఉండాలని పట్టుబట్టి మరీ జిల్లాలు దాటించి పోటీ చేయించారు. పాయకరావుపేటలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గత ఏడాది ఎన్నికల్లో ఆమెను ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు బదిలీ చేశారు. అక్కడ కూడా ఆమె ఓడిపోయింది. ఆ వెంటనే అక్కడ ఉండకుండా.. మళ్లీ పాయకరావుపేటలో చక్రం తిప్పాలని భావించి.. ఇక్కడకు వచ్చారు.
తిరిగి రావడంతో…
పాయకరావుపేటలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ బొబ్బిలి బంగారయ్య వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తిరిగి ఆమెకు పాయకరావుపేట పగ్గాలు ఇవ్వడంతో ఆమెను ముందు నుంచి వ్యతిరేకించిన వర్గాలు అన్ని ఆమెకు సహకరించడం లేదు. దీంతో ఇప్పుడు మరింతగా ఆమెపై వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. నిజానికి తాము వద్దని కదా .. గత ఏడాది ఎన్నికల్లో పంపేసింది. మరి ఇప్పుడు మా నెత్తిన ఎందుకు రుద్దుతున్నారు? అని ఇక్కడి తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
సహకరించేది లేదంటూ….
పార్టీలో అందరికీ అందుబాటులో ఉండడం లేదని, పార్టీలో సీనియర్లను కనీసం కూడా గౌరవించడం లేదని, అంతా మేకప్-ప్యాకప్ మాదిరిగా రాజకీయాలు చేస్తున్నారని ఆమెపై తమ్ముళ్లు అంతర్గత సంబాషణల్లో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను మళ్లీ తమపై రుద్దడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు ఎప్పుడు టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మరి బాబు దీనిపై ఇంకో సారి దృష్టి పెట్టాలని అంటున్నారు పరిశీలకులు.