మళ్లీ ఎన్నికలప్పుడే కన్పిస్తాడట
వంగవీటి రాధా రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. ఆయన కీలక సమయాల్లోనూ ప్రజాసమస్యలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా వంగవీటి రాధా జాడ లేదు. అప్పుడెప్పుడో [more]
వంగవీటి రాధా రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. ఆయన కీలక సమయాల్లోనూ ప్రజాసమస్యలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా వంగవీటి రాధా జాడ లేదు. అప్పుడెప్పుడో [more]
వంగవీటి రాధా రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. ఆయన కీలక సమయాల్లోనూ ప్రజాసమస్యలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా వంగవీటి రాధా జాడ లేదు. అప్పుడెప్పుడో అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించిన వంగవీటి రాధా ఆ తర్వాత కన్పించకుండా పోయారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటుతున్నా వంగవీటి రాధా మాత్రం అడపా దడపా బయటకు రావడం తప్ప ఆయన సొంత కార్యక్రమాలకే పరిమితమయ్యారు.
ప్రస్తుతమయితే టీడీపీలోనే…..
వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా వంగవీటి రాధాను పెద్దగా పట్టించుకోవడం లేదు. సీరియస్ పొలిటీషయన్ కాదని భావించిన పార్టీ అధిష్టానం ఆయనను పదవులకు కూడా దూరం పెట్టింది. దీంతో రాధాకు పనిలేకుండా పోయింది. తన నియోజకవర్గ పరిధిలో ఏదైనా సమస్య ఉంటే బయటకు రావడం తప్పించి రాష్ట్ర స్థాయి నేతగా ఎదుగుదామన్న ధ్యాస వంగవీటి రాధాకు లేకుండాపోయింది.
ఎలాంటి కార్యక్రమాలకు…..
2019 ఎన్నికలకు ముందు వరకూ వైసీపీలో ఉన్న వంగవీటి రాధా తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే టీడీపీ దారుణంగా ఓటమి పాలయిన తర్వాత పార్టీలో యాక్టివ్ గా లేరు. చంద్రబాబు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు కూడా వంగవీటి రాధా హాజరుకావడం లేదు. ఆయన ఎన్నికలకు ముందే మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అవకాశం ఉన్నా…….
నిజానికి ప్రస్తుతం ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకున్నారు. ఆ ఉద్యమాన్ని నెత్తినెత్తుకుని వంగవీటి రాధా రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగే అవకాశముంది. కానీ వంగవీటి రాధా ఆ ధైర్యం చేయడం లేదు. తండ్రి రంగా ఇమేజ్ ఉన్నప్పటికీ వంగవీటి రాధా దానిని సక్రమంగా వినియోగించుకోలేకపోయినందునే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అనుచరులే అంగీకరిస్తున్నారు. ఇక వంగవీటి మనకు కన్పించేది ఎన్నికలకు ముందే అన్న కామెంట్స్ టీడీపీ వర్గాల నుంచే విన్పిస్తుండటం విశేషం.