ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. ఎంపీగా పంపేయండి
అధికార వైసీపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చిత్రమైన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. సాధారణంగా ఉప ఎన్నిక అంటే.. ఇప్పటికే ఉన్న నాయకులు పోటెత్తుతారు. తమకు కావాలంటే.. [more]
అధికార వైసీపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చిత్రమైన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. సాధారణంగా ఉప ఎన్నిక అంటే.. ఇప్పటికే ఉన్న నాయకులు పోటెత్తుతారు. తమకు కావాలంటే.. [more]
అధికార వైసీపీలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చిత్రమైన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. సాధారణంగా ఉప ఎన్నిక అంటే.. ఇప్పటికే ఉన్న నాయకులు పోటెత్తుతారు. తమకు కావాలంటే.. తమకు కావాలని సదరు టికెట్ కోసం పోరాటాలు ప్రారంభిస్తారు. కానీ, వైసీపీలో మాత్రం చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విషయంలో జగన్ ఓ క్లారిటీకి వచ్చేశారు. డాక్టర్ గురుప్రసాద్ పేరు దాదాపు ఖరారైనట్టే. బల్లి కుటుంబానికి ఎమ్మెల్సీ ఆఫర్ వెళ్లిందంటున్నారు. ఇక ఇక్కడ తాజా పరిణామం ఏంటంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఐఏఎస్ వరప్రసాద్ పై కొన్నాళ్లుగా సొంత పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తీవ్ర అసంతృప్తితో….
మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు .. ఆయనపై ఫైర్ అవుతున్నాయి. పొరపాటున ఆయనను గెలిపించామని.. మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదని, పైగా వసూళ్ల పర్వాన్ని బాహాటంగానే సాగిస్తున్నారని.. పైగా.. నేను మాజీ ఐఏఎస్ నా ముందు మీ ఆటలు సాగవు.. అని కామెంట్లు చేయడాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా ఇటీవలే ఆయన తాను తన డబ్బులతోనే గెలిచాను.. జగన్‌కు ఫిర్యాదు చేసినా ఏం చేయలేరన్న కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. తాను స్వతంత్రంగా గెలిచానని.. ఎవరికీ భయపడేది లేదని కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ నేతలు విస్తుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
మళ్లీ ఎంపీగా పంపమంటూ….
ఇప్పటికే ఎన్నోసార్లు పంచాయితీలు జరిగినా ఏదీ ఓ కొలిక్కి రాకపోవడంతో వరప్రసాద్ మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను ఆసరా చేసుకుని ఇక్కడి నాయకులు అధిష్టానానికి ఓ డిమాండ్ పెట్టారు. అదేంటంటే.. ఇక, తమకు వరప్రసాద్ సేవలు చాలని.. ఆయనను తిరుపతి పార్లమెంటు సీటుకు జరిగే ఉప ఎన్నికకు అభ్యర్థిగా ప్రకటించి.. అక్కడకు పంపేయాలని.. అక్కడ గతంలో ఆయన ఎలాగూ గెలిచిన అనుభవం.. పరిచయాలు ఉన్నాయి కనుక.. ఆయన అక్కడ నెగ్గుతారని.. ఇక్కడ మాత్రం ఆయన వద్దని నాయకులు తమ డిమాండ్‌లో పేర్కొంటున్నారు.
అర్ధరహితమే అయినా….
గూడూరు స్థానానికి మళ్లీ ఉప ఎన్నికలు వచ్చినా… ఎవరికి అవకాశం ఇచ్చినా.. తాము భారీ మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేను గెలిపిస్తామని.. కూడా వారు చెబుతుండడం గమనార్హం. దీంతో గూడూరు వైసీపీ రాజకీయం రచ్చ రచ్చగా మారిందనే టాక్ వినిపిస్తోంది. గూడురులో వైసీపీ నేతల కోరిక జగన్ ఎలాగూ తీర్చే ఛాన్స్ లేకపోయినా ఈ డిమాండ్ మాత్రం చిత్రంగా ఉందే.