ఉప ఎన్నిక ఇంత కష్టం తెచ్చిపెడుతుందనుకోలేదుగా?
తిరుపతి ఉప ఎన్నిక ఈ ఎమ్మెల్యే కు ఇబ్బంది గా మారినట్లు కన్పిస్తుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతో ఈ వైసీపీ ఎమ్మెల్యే భవిష్యత్ తేలనుంది. నెల్లూరు [more]
తిరుపతి ఉప ఎన్నిక ఈ ఎమ్మెల్యే కు ఇబ్బంది గా మారినట్లు కన్పిస్తుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతో ఈ వైసీపీ ఎమ్మెల్యే భవిష్యత్ తేలనుంది. నెల్లూరు [more]
తిరుపతి ఉప ఎన్నిక ఈ ఎమ్మెల్యే కు ఇబ్బంది గా మారినట్లు కన్పిస్తుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలతో ఈ వైసీపీ ఎమ్మెల్యే భవిష్యత్ తేలనుంది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కు తిరుపతి ఉప ఎన్నిక రాజకీయంగా ఇబ్బంది తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఈ ఎన్నిక సమయంలో ఆయన అసమ్మతి మరింత ఎదుర్కొంటున్నారు. ఎన్నిక కావడంతో అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన తరుణంలో ఆయనకు పార్టీ నేతలే షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.
ఎంపీగా.. ఎమ్మెల్యేగా…
వరప్రసాద్ ప్రభుత్వ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులోనే ఎక్కువ ఉన్న వరప్రసాద్ ఇప్పటికీ ఆయన కుటుంబం చెన్నైలోనే ఉంటుంది. 2014 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన వరప్రసాద్ ను జగన్ పట్టుబట్టి మరీ గూడూరు ఎమ్మెల్యేగా చేశారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్ కుమార్ టీడీపీలోకి వెళ్లిపోవడంతో వరప్రసాద్ ను జగన్ బరిలోకి దింపి విజయం సాధించేలా చూశారు.
మూడు గ్రూపులతో సతమతం….
కానీ గూడూరు నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. ఆనం, నేదురుమిల్లి, నల్లపురెడ్డి కుటుంబాల వర్గాలున్నాయి. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గమైనా ఆధిపత్యమంతా రెడ్లదే. అయితే మూడు గ్రూపులను కలుపుకుని పోవడంలో వరప్రసాద్ విఫలమయ్యారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హరిశ్చాంద్రారెడ్డికి ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి. తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వరప్రసాద్ కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మెజారిటీ రాకుంటే…?
అయితే వైసీపీకి పట్టున్న గూడూరు నియోజకవర్గంలో తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంత మేరకు ఓట్లను సాధిస్తుందన్నది ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో దాదాపు 47 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే మెజారిటీని ఈఉప ఎన్నికలో గూడూరు నుంచి తీసుకురాకుంటే వరప్రసాద్ కు రాజకీయంగా కష్టాలు తప్పవంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేతకు అవకాశమిస్తారని పార్టీలో బలంగా టాక్ విన్పిస్తుంది. మెజారిటీ రాకపోతే వరప్రసాద్ స్థానంలో కొత్త నేత వచ్చే అవకాశముంది. మరి తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఈ నేత రాజకీయ భవిష్యత్ ను తేల్చనుంది.