అక్కడ యువనేత కన్ను.. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే సర్దుకోవడమేనా ?
నెల్లూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం గూడూరు. ఇక్కడ వైసీపీ నాయకుడు మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన పార్టీలో నేతలను.. [more]
నెల్లూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం గూడూరు. ఇక్కడ వైసీపీ నాయకుడు మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన పార్టీలో నేతలను.. [more]
నెల్లూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం గూడూరు. ఇక్కడ వైసీపీ నాయకుడు మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన పార్టీలో నేతలను.. మంత్రులను కూడా లెక్కచేయడం లేదనే విమర్శలు కొన్నా ళ్లుగా వినిపిస్తున్నాయి. దీనికితోడు.. ఆయన ప్రతిపనికీ కమీషన్ అడుగుతున్నారని.. ఎన్నికల సమయంలో తాను ఖర్చు చేశానని.. మొహం మీదే చెబుతున్నారట. ఆఖరుకు వైసీపీ నేతలకు పనులు చేసిపెట్టాలన్నా కూడా వరప్రసాద్.. ఇదే వైఖరి అవలంబిస్తుండడంతో నేతలు ఆయనను దూరం పెట్టారు. పార్టీ అధిష్టానం కూడా వరప్రసాద్‌ను పట్టించుకోవడం లేదు.
ఎమ్మెల్సీగా ఎంపిక చేసినా..?
ఇదిలావుంటే.. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకుని హఠాన్మరణం చెందిన బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తిని.. కొందరు వైసీపీ సీనియర్లు.. గూడూరులో ట్రై చేయొచ్చుగా..! అని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మండలికి పంపించారు. అయితే.. కేంద్రం కనుక మండలిని రద్దు చేస్తే.. తన భవితవ్యం ఏంటనేది.. చక్రవర్తికి కూడా దిగులుగా ఉంది. దీనికితోడు.. వరప్రసాద్‌పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వైసీపీలో కీలక నేతలు.. ఇప్పుడు చక్రవర్తిని గూడూరు వైపు నడిపిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ నీకే దక్కుతుంది.. ఇప్పటి నుంచే నువ్వు కష్టపడు అని చెబుతున్నారట.
నివాసం కూడా ఇక్కడే…?
దీంతో కళ్యాణ్ చక్రవర్తి.. కొన్ని రోజులుగా గూడూరులో పర్యటిస్తున్నారు. ఇక్కడ నుంచి గతంలో బల్లి దుర్గా ప్రసాద్.. టీడీపీ తరఫున నాలుగు సార్లు విజయం దక్కించుకుని అసెంబ్లీలో వాణిని వినిపించారు. 1985, 1994, 1999, 2009లోనూ దుర్గా ప్రసాద్ ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు సన్నిహితులు, మిత్రులతోపాటు.. సానుభూతి పరులు కూడా ఉన్నారు. ఇక్కడ బల్లి ఫ్యామిలీకి బలమైన అనుచరగణం ఉంది. పైగా బల్లి నివాసం ఉండేది కూడా గూడూరులోనే.
ఆయన టార్గెట్ గానే…?
దీంతో కళ్యాణ్ చక్రవర్తి కనుక ఇక్కడ నిలబడితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఈజీయేనని వైసీపీ నాయకులు కూడా చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ టార్గెట్‌గానే కొందరు రెడ్డి వర్గం నేతలు కళ్యాణ్‌ను ముందు పెట్టి ఈ రాజకీయం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలానూ.. యువతకు ఎక్కువ టికెట్లు ఇచ్చే ఉద్దేశంతో ఉన్న జగన్.. చక్రవర్తికి దీనిని కేటాయించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో చక్రవర్తి ఇప్పటి నుంచే దీనిపై దృష్టి పెడుతున్నట్టు సమాచారం.