వర్లకు మరో వరాన్ని ఇస్తున్నారా?
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఇక్కడ పార్టీని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. వాస్తవానికి టీడీపీ మూలాలున్న ఉప్పులేటి కల్పన ఇక్కడ [more]
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఇక్కడ పార్టీని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. వాస్తవానికి టీడీపీ మూలాలున్న ఉప్పులేటి కల్పన ఇక్కడ [more]
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఇక్కడ పార్టీని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. వాస్తవానికి టీడీపీ మూలాలున్న ఉప్పులేటి కల్పన ఇక్కడ పార్టీకి ఇంచార్జ్‌గా ఉన్నారు. అయినప్పటికీ.. పార్టీలో మాత్రం ఊపులేదు. 2009 ఎన్నికల సమయంలో కల్పన టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు కూడా 2004లో నిడుమోలు నుంచి ఆమె టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రెండు సార్లు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె అనూహ్యంగా 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనూహ్యంగా టీడీపీలోకి జంప్ చేశారు.
స్థానిక క్యాడర్ వ్యతిరేకిస్తున్నా…..
2014 ఎన్నికల్లో కల్పనపై టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్యకు ఇష్టం లేకపోయినా కూడా చంద్రబాబు కల్పనను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కల్పనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె తనతో పాటు తీసుకువచ్చిన వైసీపీ కేడర్‌కే ప్రయార్టీ ఇవ్వడంతో ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి కూడా కల్పన వర్సెస్ వర్ల రామయ్య మధ్య పామర్రు టీడీపీలో అగ్నిజ్వాలల్లా రాజకీయం మండింది. ఇక ఎన్నికల్లోనూ అనేక ఒత్తిళ్లకు తలొగ్గిన బాబు ఆమెకే సీటు ఇవ్వగా ఆమె ఓడిపోయారు.
ఐదు మండలాల్లో నేతలు….
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా కల్పన పామర్రును వదిలేశారు. అసలు పార్టీ కార్యక్రమాలు చేపట్టడం కూడా మర్చిపోయారు. పామర్రుకు తాను ఇన్చార్జ్గా ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయారు. ఇక టీడీపీ కేడర్ కూడా ఆమెకు సపోర్ట్ చేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డగా ఉన్న పామర్రుకు చంద్రబాబు, లోకేష్ సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిధులు ఇచ్చినా కూడా ఇక్కడ పార్టీ ఘోరంగా 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అసలు కల్పనను ఇక్కడ తాము అంగీకరించే పరిస్థితే లేదని ఐదు మండలాల్లోని ముఖ్య నేతలు తెగేసి చెపుతున్న పరిస్థితి.
కల్పనను పక్కన పెట్టాలని….
దీంతో ఇక్కడ పార్టీ అచేతన స్థితిలో ఉంది. మరోపక్క, వైసీపీలోకి వెళ్లేందుకు కల్పన ప్రయత్నాలు చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను పక్కన పెట్టి ఆది నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ.. జంపింగులకు అవకాశం లేని మెంటాలిటీతో ముందుకు సాగుతున్న వర్ల రామయ్యకే మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని ఇక్కడి నాయకులు కోరుతున్నారు. అయితే జిల్లా టీడీపీలో వర్ల రామయ్యను వ్యతిరేకించే ఒకరిద్దరు నాయకుల వల్లే ఈ మార్పు ఇప్పటకీ లేట్ అవుతూ వస్తోందని తెలుస్తోంది. రేపో మాపో అయినా పామర్రులో కల్పనకు ఉద్వాసన పలికి వర్ల రామయ్యకు పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు.