వసంత రగిలిపోతున్నారు… ఏం అర్ధం కావడం లేదట
రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవాలని ఏనాయకుడికైనా ఉంటుంది. అదును చూసి దెబ్బేయడం కూడా సహజమే. ఇది ఏ పార్టీలో అయినా కామనే. అయితే, అదును ఉన్నా లేకున్నా.. [more]
రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవాలని ఏనాయకుడికైనా ఉంటుంది. అదును చూసి దెబ్బేయడం కూడా సహజమే. ఇది ఏ పార్టీలో అయినా కామనే. అయితే, అదును ఉన్నా లేకున్నా.. [more]
రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవాలని ఏనాయకుడికైనా ఉంటుంది. అదును చూసి దెబ్బేయడం కూడా సహజమే. ఇది ఏ పార్టీలో అయినా కామనే. అయితే, అదును ఉన్నా లేకున్నా.. వేటు వేసేయాలని చూడడం ఇప్పుడు కృష్ణాజిల్లా మైలవరంలో చర్చకు దారితీసింది. ఈ నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో సీనియర్ మోస్ట్ రాజకీయ నేత వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు జగన్ విజయవాడ ఎంపీగా పోటీ చేయమని చెప్పినా కూడా తమ కుటుంబ చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన దేవినేని ఉమామహేశ్వరరావును ఓడిస్తానని సవాల్ చేసి మరీ వైసీపీ తరఫున విజయం సాధించారు. దేవినేని ఉమామహేశ్వరరావు పై వసంతకు పీకలదాకా కోపం ఉంది.
వదిలిపెట్టకుండా…..
తన కుటుంబానికే చిరకాల రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్థి కాబట్టి ఇది సహజం. ఎన్నికలకు ముందు తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడనే తీవ్ర అక్కసు కూడా మాజీ మంత్రి ఉమపై వసంత కృష్ణ ప్రసాద్ కు ఉంది. దీంతో ఆయననన్నా.. ఆయన వర్గమన్నా కూడా వసంత కృష్ణ ప్రసాద్ చిందులు తొక్కుతున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. గతంలో వలంటీర్ల నియామకం జరిగినప్పుడు ఉమ వర్గానికి చెందిన వారని తెలిస్తే.. చాలు కనీసం దరఖాస్తు చేసు కునేందుకు కూడా ఛాన్స్ లేకుండా చేశారు. అదే సమయంలో ఉమ వర్గానికి అడుగడుగు నా చెక్ పెడుతు న్నారు. అయినా కూడా వసంత కృష్ణ ప్రసాద్ లో కోపం చావడం లేదు. ఏడాదైపోయింది.. ఉమ వర్గాన్ని ఇంకా ఇరుకున పెట్టాలని ఆయన తపిస్తూనే ఉన్నారట. ఇది ఇప్పుడు మైలవరంలో ఆసక్తిగా మారింది.
వేలంలో వారిని…?
ఈ క్రమంలోనే తాజాగా నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా వేపరాల ప్రాంతంలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 31 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని దేవా దాయ శాఖ నిర్వహిస్తోంది. మూడేళ్లకోసారి వాటికి వేలం వేసి.. రైతులకు అప్పగించి కౌలు తీసుకుంటు న్నారు. గతంలో టీడీపీ హయాంలో వేలం నిర్వహించినప్పుడు టీడీపీకి చెందిన రైతులు వీటిని వేలంలో పాడుకుని దక్కించుకున్నారు. వీటికి ఈ ఏడాది ఏప్రిల్‌తో కౌలు ముగిసింది. ఎప్పుడు కౌలు ముగుస్తుందా? ఎప్పుడు వీళ్లని వెళ్లగొట్టి వైసీపీకి చెందిన రైతులకు ఇప్పించు కుందామా? అని వసంత కృష్ణ ప్రసాద్ ఎదురు చూస్తున్నా రు. అయితే, ఈ భూములకు వేలం వేయాల్సిన ఏప్రిల్‌లో లాక్డౌన్ కారణంగా వేలం నిర్వహించలేదు.
పట్టిన పట్టు వీడకుండా…?
దీంతో ప్రభుత్వం ఉన్నవారినే మరో ఏడాది పాటు కొనసాగిస్తూ.. జీవో జారీ చేశారు. దీంతో అప్పటికే ఉన్న టీడీపీ రైతులు మరో ఏడాదికి కౌలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఇంతా జరిపోయిన తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దీనిపై పంచాయితీ పెట్టారు. ఎలాగైనా ఆ రైతులను పక్కన పెట్టి.. వేలం నిర్వహించాలని పట్టుబ ట్టారు. అయితే, ఇది కుదరదు సార్.. ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చేసిందని చెప్పినా కూడా వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం పట్టు వీడడం లేదు. ఆఖరుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వసంత కృష్ణ ప్రసాద్ ను శాంతింపజేయాల్సి వచ్చిందట. ఈ ఏడాదికి సర్దు కోండి సార్.. వచ్చే సారి చూసుకుందాం. అనడంతో శాంతించారట. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.