గుంటూరు వెస్ట్‌లో చక్రం తిప్పుతున్న బెజవాడ నేత
అవకాశం ఉండాలే కానీ.. నాయకులు ఎక్కడైనా చక్రం తిప్పుతారనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి నాయకులకు కొదవలేదు. ఇప్పుడు ఇలాంటి విషయమే చర్చకు వచ్చింది. బెజవాడకు [more]
అవకాశం ఉండాలే కానీ.. నాయకులు ఎక్కడైనా చక్రం తిప్పుతారనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి నాయకులకు కొదవలేదు. ఇప్పుడు ఇలాంటి విషయమే చర్చకు వచ్చింది. బెజవాడకు [more]
అవకాశం ఉండాలే కానీ.. నాయకులు ఎక్కడైనా చక్రం తిప్పుతారనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి నాయకులకు కొదవలేదు. ఇప్పుడు ఇలాంటి విషయమే చర్చకు వచ్చింది. బెజవాడకు చెందిన నాయకుడు, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గుంటూరు రాజకీయాల్లో జోరు పెంచారని అంటున్నారు. నిజానికి ఆయన మంత్రి కాబట్టి.. జోరు పెంచారని అనేవారు కొందరైతే.. కాదు, ఉద్దేశ పూర్వకంగా తన సామాజిక వర్గంలో పట్టు పెంచుకునేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. దీంతో ఈ విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
వైశ్య సామాజికవర్గంలో…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన వెలంపల్లి శ్రీనివాస్ కి తన సొంత సామాజిక వర్గంలో పట్టు తక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో ఆయన ఇటీవల కాలంలో వైశ్య సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెంచారు. ఈ క్రమంలోనే ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. వారిని తీసుకువచ్చి వైసీపీలో చేర్చుతున్నారు. ఫలితంగా అటు సామాజిక వర్గం యాక్టివ్ అయ్యేలా.. మరోపక్క, తన హవా నడిచేలా వ్యూహాత్మకంగా వెలంపల్లి శ్రీనివాస్ అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి తన మంత్రి పదవిని కూడా ఉపయోగించుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జగన్ కు సన్నిహితుడు ఉన్నా….
గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మద్దాలి గిరి విజయం సాధించారు. అయితే, తర్వాత కాలంలో ఆయన వైసీపీలో చేరారు. దీనికి వెలంపల్లి శ్రీనివాస్ కర్త, కర్మగా వ్యవహరించారని అంటారు పరిశీలకులు. ఈ దూకుడు సక్సెస్ అవడం, జగన్ దగ్గర మంచి మార్కులు పడడంతో ఇప్పుడు నియోజకవర్గంలోనూ తన హవా చలాయిస్తున్నారట మంత్రి. అంటే.. వైసీపీని ఇక్కడ మరింత బలోపేతం చేసేందుకు ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. నిత్యం ఎమ్మెల్యే గిరితో టచ్‌లో ఉండడం, నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడం వంటివి చేస్తున్నారట. వాస్తవానికి ఇక్కడ వైసీపీ నేత, జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు.
అప్పిరెడ్డిని పక్కన పెట్టి మరీ….
ఆయన తన టికెట్‌ను సైతం త్యాగం చేశారు.కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో అప్పిరెడ్డిని పక్కన పెట్టి.. గిరికి ప్రాధాన్యం పెంచడంతోపాటు.. తన హవాను పెంచుకునేందుకు కూడా డ్యూయెల్గా ఉపయోగపడుతుందని వెలంపల్లి శ్రీనివాస్ భావిస్తున్నారని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంతో పాటు ఓవరాల్‌గా గుంటూరు నగరంలో వైశ్య సామాజిక వర్గం ఎక్కువుగా ఉంది. వారి అండదండలతో పాటు తన సామాజికవర్గంలో తిరుగులేని పట్టు సాధించేందుకే మంత్రి ఇక్కడ కూడా తన హవా చెలాయిస్తూ గిరికి ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందిస్తున్నారట.