ఆరోజు ఎన్టీఆర్ గెలుస్తాననుకోలేదా.. ?
ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. వెండి తెర మీద దైవాంశ సంభూతిడిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన పోషించిన దేవుడి పాత్రలను చూసి రాముడు, కృష్ణుడు ఇలాగే [more]
ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. వెండి తెర మీద దైవాంశ సంభూతిడిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన పోషించిన దేవుడి పాత్రలను చూసి రాముడు, కృష్ణుడు ఇలాగే [more]
ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. వెండి తెర మీద దైవాంశ సంభూతిడిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన పోషించిన దేవుడి పాత్రలను చూసి రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారు అనుకేవారు జనం. ఇక ఎన్టీఆర్ కి అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఆయనే నంబర్ వన్ గా నిలిచారు. ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఒక వైపు క్యూ కడుతూండగానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. అయితే ఎన్టీఆర్ కి కూడా తాను ముఖ్యమంత్రి అవుతాను అన్న నమ్మకం లేదుట. దాంతో ఆయన ఎన్నికలు అయిపోయాక కూడా కొన్ని సినిమాలు చేయాలనుకుని చాలా మందికి కాల్షీట్లు కూడా ఇచ్చారుట.
అంతొస్తే గొప్పే…?
ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టిన తరువాత తనకంటూ ఒక రాజకీయ అంచనా వేసుకున్నారుట. తనది కొత్త పార్టీ, కాంగ్రెస్ ఢక్కా మెక్కీలు తిన్న పార్టీ. అందువల్ల తన పార్టీకి గట్టిగా వస్తే గిస్తే అరవై సీట్లు వస్తే గొప్ప అని భావించారుట. ఆ మాటనే ఆయన తనతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలకు చెబుతూ ఎన్నికల తరువాత కూడా సినిమాలు చేద్దామని వారితో అన్నారుట. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ కి 200 దాకా సీట్లు రావడంతో ఆయన సీఎం అయిపోయారు. అంటే ఇది అన్న గారు కూడా నమ్మని నిజమన్న మాట.
ఇన్నాళ్ళకు రివీల్ …
ఎన్టీఆర్ కుటుంబ బంధువు, నాటి నిర్మాత కాకర్ల క్రిష్ణ ఇదే విషయాన్ని తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళినా సీఎం అయిపోతాను అనుకోలేదని, అందుకే తనకు కూడా ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారని చెప్పారు. కానీ అదృష్టం ఆయన వైపు ఉండి ఎకాఎకీన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయిపోయి చరిత్ర సృష్టించారని అన్నారు. ఎన్టీయార్ కేవలం తొమ్మిది నెలలలో అధికారాన్ని అందుకుని గిన్నీస్ రికార్డునే తిరగరాశారని ఆయన అన్నారు.
సరైన టైమ్…
నిజానికి అప్పటికి కాంగ్రెస్ మూడున్నర దశాబ్దాలుగా అప్రతిహతంగా అధికారంలో ఉంది. ఆ పార్టీ మీద జనాలలో వ్యతిరేకత ఉంది. కానీ సరైన నాయకుడు ఎవరూ కనిపించలేదు. వెండి తెర వేలుపుగా ఉన్న ఎన్టీఆర్ ఈ రాజకీయాన్ని మారుస్తాను అంటూ జనంలోకి వచ్చేసరికి వారంతా ముగ్దులై ఓట్లను కుమ్మరించేశారు. ఎన్టీఆర్ కి కూడా రాజకీయాల మీద మొదట్లో అవగాహన, ఆసక్తి లేవు. కానీ ఆయన చివరలో చేసిన కొన్ని సినిమాల వల్ల ప్రేరేపితుడై అలా రాజకీయ రంగ ప్రవేశం అనుకోకుండా చేశారు. ఇలా ఏ రకమైన అంచనాలు లేకుండా వచ్చిన ఎన్టీఆర్ పొలిటికల్ మూవీ టీడీపీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత సినిమా నటులు కొందరు సీఎం కుర్చీ మీద మోజుతో వచ్చినా కూడా జనాలు తిరస్కరించడానికి కూడా అప్పటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడమే కారణంగా విశ్లేషించాలి.