వెంకిమామ మూవీ రివ్యూ
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ నటీనటులు: వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్, ప్రకాష్‌రాజ్, నాజర్, రావూ రమేష్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖ రామన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు. సినిమాటోగ్రఫీ: [more]
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ నటీనటులు: వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్, ప్రకాష్‌రాజ్, నాజర్, రావూ రమేష్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖ రామన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు. సినిమాటోగ్రఫీ: [more]
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
నటీనటులు: వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్, ప్రకాష్‌రాజ్, నాజర్, రావూ రమేష్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖ రామన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు.
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ ఎస్ థమన్
ప్రొడ్యూసర్స్: దగ్గుబాటి సురేష్ బాబు, టిజి విశ్వా ప్రసాద్
దర్శకత్వం: బాబీ (కేయస్ రవీంద్ర)
తన ఏజ్ కి సరిపోయే కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెంకటేష్… యంగ్ హీరోలలో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న నాగ చైతన్య కలిసి బాబీ దర్శకత్వంలో ఓ మినీ మల్టీస్టారర్ సినిమా చేసారు. వెంకటేష్ – నాగ చైతన్య మామ అల్లుళ్ళు అవడం.. వారిద్దరూ స్క్రీన్ మీద కూడా మామాఅల్లుళ్లు గా వెంకిమామ అంటూ సినిమా చెయ్యడంతో… సినిమాపై మొదటినుండి మంచి క్రేజ్ వచ్చేసింది. వెంకటేష్ మిలట్రీ ఆఫిసర్ గా నాగ చైతన్య వెంకీ మేనల్లుడిగా వెంకటేష్ కి పెళ్లి చెయ్యాలంటూ తిరగడం, ఇదంతా కామెడీ తో కూడిన ఎమోషన్ గా సినిమాని బాబీ తెరకెక్కించాడని వెంకిమామ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ సినిమా లో పాయల్ రాజపుట్, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటించడంతో పాటుగా… ట్రైలర్ తోనూ, వెంకిమామ టీం చేసిన ప్రమోషన్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తి మొదలయ్యింది. మరి వెంకిమామ సినినిమా హిట్ అంటూ ధీమాగా ఉన్న వెంకటేష్, నాగ చైతన్య కి ఈ సినిమా ఎలాంటి హిట్ అందించిందో? రియల్ లైఫ్ లో క్రేజీ అయిన ఈ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లో ఎలాంటి హిట్ కొట్టారో? సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కార్తీక్(నాగ చైతన్య) తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. కార్తీక మేనమామ వెంకటరత్నం నాయుడు (వెంకటేష్), అమ్మ నాన్న లేని తన అల్లుడిని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుతాడు. తాను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అల్లుడ్ని సరిగ్గా చూసుకోదని పెళ్లి చేసుకోవటమే మానేస్తాడు. ఇక కార్తీక్ కూడా మేనమామే ప్రపంచంగా బతికేస్తుంటాడు. అయితే తమ ఊరికి వచ్చిన హిందీ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్‌పుత్)తో వెంకటరత్నం, క్లాస్‌మెట్ హారిక(రాశీఖన్నా) తో కార్తిక్ ప్రేమలో పడతారు. కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కార్తీక్ మేనమామ వెంకటరత్నం కి చెప్పకుండా భారత ఆర్మీలో చేరిపోతాడు. అయితే అక్కడ కార్తీక్ ఆ ఆర్మీ క్యాంపులో అకస్మాత్తుగా కనబడకుండా పోతాడు. అయితే అంతప్రాణంగా కలిసున్న మామాఅల్లుళ్లు విడిపోవడానికి కారణం ఏంటి..? మామతో కలిసి అల్లరి చేసే కార్తిక్ సైన్యంలోకి ఎందుకు వెళ్లాడు? అసలు ఆ జాతకాల గోలేమిటి? మామా అల్లుళ్లు ప్రేమ ఏ దరికి చేరింది.? అసలు మామాఅల్లుళ్ళు తిరిగి ఎలా కలిశారు? అన్నదే వెంకిమామ మిగతా కథ.
నటీనటుల నటన:
వెంకటేష్ – నాగ చైతన్య కనిపించే ప్రతీ ఫ్రేమ్ కూడా మంచి ఎంటర్టైనింగ్ గా ప్రేక్షకులకు కనుల పండుగగా ఉంటుంది. తెర మీద వీరిద్దరి కాంబినేషన్ సూపర్బ్ అనిపించేలా ఉంది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. కాకపోతే వెంకటేష్ స్థాయి యాక్టింగ్‌ను మ్యాచ్ చేయటంలో నాగ చైతన్య కాస్త తడబడినా కార్తీక్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆర్మీ లుక్ లో చైతు బావున్నాడు. హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు గ్లామర్ విషయంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. అయితే హీరోయిన్స్ పాత్రలకు ఈ సినిమాలో నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించారు. నాజర్, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, విద్యుల్లేఖ రామన్ తో పాటుగా మిగతా నటులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
వెంకటేష్ – నాగ చైతన్య మామఅల్లుళ్ళు అని తెలుసు. కానీ తెర మీద వారు కనిపించలేదు. అందుకే వెంకిమామ లో వెంకటేష్ – నాగ చైతన్య మామఅల్లుళ్లుగా నటిస్తున్నారు అనగానే.. ఆ సినిమాపై భీబత్సమైన క్రేజ్ వచ్చేసింది. అయితే ఎప్పుడూ కొత్త కథ చెప్పడం సాధ్యం కాదు.. కొన్నిసార్లు ఉన్న కథను కొత్తగా చెప్పడమే… దర్శకుడు బాబీ కూడా వెంకీ మామతో ఇదే చేశాడు.మనం ఎన్నో సార్లు చూసిన కథ.. ఎంతో పండిన ఎమోషన్.. వెంకిమామ సినిమాతో మళ్ళీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు బాబీ. వెంకీమామలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ, మామ అల్లుళ్ళ అల్లరిని బాగా హైలైట్ చేశాడు దర్శకుడు బాబీ..
ఇటు వెంకటేష్ లవ్ స్టోరీ.. అటు నాగ చైతన్య ప్రేమ కథను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. దాన్ని జాతకంతో ముడిపెట్టాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని ఎమోషనల్‌గా తెరకెక్కించాడు. మామా అల్లుళ్లు దూరమవ్వటం ఆ తరువాత జరిగే పరిణామాలు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తాయి. ఓ వైపు జాతకం.. మరోవైపు ప్రేమను సరిగ్గా బ్యాలెన్స్ చేయడంలో బాబీ ఎక్కడో తడబడినట్లు అనిపించింది. ఆ రెండింటి మధ్య కథ రాసుకున్నా కూడా.. కథనంలో అక్కడక్కడా తేడా కొట్టేసింది. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు లాజిక్ లేకపోవటంతో పాటు సుధీర్ఘంగా సాగుతూ ఇబ్బంది పెడతాయి. మిలటరీ మిషన్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా తెర మీద అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు.ఇక సినిమా ఓవరాల్‌గా వెంకీ మామ.. జస్ట్ టైమ్ పాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్. మామాఅల్లుళ్ళ కోసం ఓసారి చూడొచ్చు.
సాంకేతికంగా..
థమన్ వెంకిమామ కి ఇచ్చిన మ్యూజిక్ కన్నా నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. పాటలు కూడా పర్వాలేదు కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరింది. అయితే ఫస్ట్ హాఫ్ లవ్, కామెడీ సీన్స్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి. పల్లెటూరి సన్నివేశాలతో పాటు ఆర్మీ ఎటాక్, కాశ్మీర్లో చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాలో చాల సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. సురేష్ బాబు నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్: వెంకటేష్ – చైతు ల కాంబో సీన్స్, ఫస్ట్ హాఫ్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, కామెడీ, మ్యూజిక్,ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ
రేటింగ్: 2.5/5