మోడీ ఎగ్జిట్ ప్లాన్ ఇదేనా?
అందరి దృష్టి రేపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే నిర్ణయం పైనే ఉంది. ప్రపంచ దేశాలు సయితం లాక్ డౌన్ నుంచి భారత్ ను మోదీ ఎలా ఎగ్జిట్ [more]
అందరి దృష్టి రేపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే నిర్ణయం పైనే ఉంది. ప్రపంచ దేశాలు సయితం లాక్ డౌన్ నుంచి భారత్ ను మోదీ ఎలా ఎగ్జిట్ [more]
అందరి దృష్టి రేపు ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే నిర్ణయం పైనే ఉంది. ప్రపంచ దేశాలు సయితం లాక్ డౌన్ నుంచి భారత్ ను మోదీ ఎలా ఎగ్జిట్ అవుతారా? అన్న ఆసక్తితో చూస్తున్నాయి. మే 3వ తేదీతో భారత్ లో లాక్ డౌన్ రెండో విడత ముగియనుంది. దీంతో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తారా? లేక కొనసాగిస్తారా? అన్నది ఎక్కడ పట్టినా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో మాట్లాడిన నరేంద్ర మోదీ తీసుకునే కీలక నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లాక్ డౌన్ కొనసాగించేందుకు…
కరోనా వైరస్ ఇప్పట్లో పోదు. అలాగని లాక్ డౌన్ ను నెలల తరబడి కొనసాగించే వీలులేదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలూ ఆదాయాలు లేక కేంద్రం వైపు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు సాయం చేయలేని స్థితిలో ఉంది. లాక్ డౌన్ ను ఇలాగే కొనసాగిస్తే ఆకలి కేకలు సంభవించే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా విన్పిస్తున్నాయి. వలస కూలీల దగ్గర నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు లాక్ డౌన్ ఎత్తివేయకుంటే రోడ్లమీదకు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికాలోనూ ఇదే జరిగింది.
అలాగని ఎత్తేసేందుకు….
పోనీ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరణాలు కూడా ఎక్కువవుతాయి. ఇప్పటి వరకూ పడ్డ శ్రమంతా వృధాగా మారనుంది. లాక్ డౌన్ ను ఒక్కసారిగా తొలగించడం కూడా కరెక్ట్ కాదన్నది నిపుణుల నుంచి వస్తున్న అభిప్రాయం. దీంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను నరేంద్ర మోదీ ఎత్తివేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దశల వారీగానే…?
దీంతో రెడ్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. గ్రీన్ జోన్ లో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయాలన్న యోచనలో ఉన్నారు. అలాగే ఆరెంజ్ జోన్ లో పరిమిత మినహాయింపులు ఇవ్వనున్నారన్న టాక్ విన్పిస్తుంది. లాక్ డౌన్ తో భారత్ జీడీపీ ఏడు శాతం తగ్గిపోతుందని ఆర్థిక వేత్తలు చేస్తున్న హెచ్చరికలతో నరేంద్ర మోదీ లాక్ డౌన్ నుంచి దేశాన్ని ఎలా ఎగ్జిట్ చేస్తారోనన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. మరికొద్ది గంటల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.