పంగనామాలు పెట్టేశారే
రాజకీయాల్లో ఓడలు, మల్లన్నల కథలు మామూలే! అయితే, ఎప్పటికప్పుడు మాత్రం మనం కొత్తగా చెబుతుంటాం.. కొత్తగా భావిస్తుంటాం.. అంతే!! ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీలోనూ ఇలాంటి మల్లన్నలు [more]
రాజకీయాల్లో ఓడలు, మల్లన్నల కథలు మామూలే! అయితే, ఎప్పటికప్పుడు మాత్రం మనం కొత్తగా చెబుతుంటాం.. కొత్తగా భావిస్తుంటాం.. అంతే!! ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీలోనూ ఇలాంటి మల్లన్నలు [more]
రాజకీయాల్లో ఓడలు, మల్లన్నల కథలు మామూలే! అయితే, ఎప్పటికప్పుడు మాత్రం మనం కొత్తగా చెబుతుంటాం.. కొత్తగా భావిస్తుంటాం.. అంతే!! ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీలోనూ ఇలాంటి మల్లన్నలు చాలా మందే ఉన్నారు. అధినేత మాటనే ఆదేశంగా భావించి.. ఆయన చెప్పిన వారికి టికెట్ త్యాగం చేసిన వారు చాలా మందే ఈ పార్టీలో ఇటీవల ఎన్నికల్లో మనకు కనిపించారు. అయితే, అందరి పరిస్థితి ఎలా ఉన్నా.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా బాగోలేదనే చెప్పాలి.
జగన్ ఆదేశాలతో….
ఇక్కడ మర్రి ఫ్యామిలీ నాలుగైదు దశాబ్దాల కాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. మొదట్లో కాంగ్రెస్‌లోను తర్వాత వైసీపీ లోనూ ఆయన చక్రంతిప్పారు. వైఎస్ ఉండగా ఆయనతో సఖ్యత పెంచుకున్న మర్రి.. తర్వాత కాలంలో ఆయన కుమారుడు జగన్‌తోనూ చెలిమి చేశారు. అయితే, 2009 నుంచి ఆయన వరుస పరాజయాలు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కాలని ఆయన ప్రయత్నించారు. అయితే, జగన్ ఆదేశాలతో అసలు పోటీ నుంచే విరమించుకుని ఎన్నారై మహిళ విడదల రజనీకి ఈ చాన్స్ ఇచ్చారు. ఆమె గెలుపునకు కూడా కృషి చేశారు.
పుట్టినరోజుకు వేడుకలకూ…..
గెలిచిన ఆమె మర్రి పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే, ఎంతైనా ఏపీ రాజకీయాలు ఆమెకు చాలా తొందరగా ఒంటబట్టాయి. ఈ క్రమంలోనే ఆమె మర్రిని పక్కన పెడుతూ వచ్చారు. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మర్రి వద్దకు పోలేదు. ధన్యవాదాలు తెలపలేదు. పైగా తాజాగా మర్రి తన పుట్టిన రోజును ఘనంగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన కీలక నాయకులు అందరూ కూడా ఆయనను అభినందించేందుకు, శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన ఇంటికి క్యూకట్టారు.
సీనియర్ నేతలు వెళ్లినా…..
ప్రత్తిపాడు ఎమ్మెల్యే, హోం మంత్రి మేకతోటి సుచరిత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సహా ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వంటి పలువురు నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కానీ, తనకు సీటు ఇచ్చి, తన గెలుపుకోసం కృషి చేసిన మర్రిని అభినందించేందుకు, శుభాకాంక్షలు చె ప్పేందుకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో విడదల మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పేట వైసీపీలో గ్రూపు రాజకీయాలకు సైతం ఆమె తెరదీస్తున్నట్టే ప్రచారం జోరుగా జరుగుతోంది.
అంతా తానే అయి….
నిన్న మొన్నటి వరకు మర్రికి సానుకూలంగా ఉన్న పార్టీ నేతలను ఆమె పక్కన పెట్టి, తనకంటూ.. సొంతగా ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. వారికే పార్టీ పనులు అప్పగిస్తున్నారు. ముఖ్యంగాఇటీవల జరిగిన గ్రామ వలంటీర్ల ఎంపికలోనూ తన అనుకున్న వారికే ఆమె పదవులు వచ్చేలా చక్రం తిప్పారని అంటున్నారు. ఇలా మొత్తంగా చూస్తే.. రజనీ రాజకీయం ఆసక్తిగా మారిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తనే అంతా అయ్యేలా చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అటు ఎన్నికల ప్రచారంలో మర్రికి జగన్ ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధిష్టానం మర్రి విషయంలో పాజిటివ్‌గా ఉంది. స్థానికంగా రజనీ మాత్రం రాజశేఖర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పేట వైసీపీ రాజకీయం మాంచి రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది.