జగన్ తర్వాత సీఎం పోస్టు ఆమెకేనట.. విడదల వారి వింత ప్రచారం
అదృష్టం ఉంటే గుర్రం ఎగరావొచ్చు! అంటారు. అయితే ఇది అందరికీ నప్పుతుందా ? అంటే కుదరదంటే కుదరదు. కానీ, కొందరు చేస్తున్న అతి ప్రచారం కారణంగా.. అధికార [more]
అదృష్టం ఉంటే గుర్రం ఎగరావొచ్చు! అంటారు. అయితే ఇది అందరికీ నప్పుతుందా ? అంటే కుదరదంటే కుదరదు. కానీ, కొందరు చేస్తున్న అతి ప్రచారం కారణంగా.. అధికార [more]
అదృష్టం ఉంటే గుర్రం ఎగరావొచ్చు! అంటారు. అయితే ఇది అందరికీ నప్పుతుందా ? అంటే కుదరదంటే కుదరదు. కానీ, కొందరు చేస్తున్న అతి ప్రచారం కారణంగా.. అధికార పార్టీ అభాసుపాలవుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విడదల రజనీ.. ఇప్పుడు మరోసారి సెంటరాఫ్ ది టాపిక్ అయ్యారు. నిజానికి ఆమె రాజకీయాల్లోకి ఏ ముహూర్తంలో అడుగు పెట్టారో.. కానీ, అప్పటి నుంచి కూడా ఆమె సంచలనాలు, కాంట్రవర్సీ అంశాలపైనే ఎక్కువుగా మీడియాలో మనిషిగా మారారు. ఆమె పొలిటికల్ ఎంట్రీయే ఓ సంచలనం. ముందుగా టీడీపీలో ఉండగా జగన్‌ను రాక్షసుడు అని చెప్పి చంద్రబాబు దృష్టిలో పడ్డ విడదల రజనీ తనకున్న స్థోమత వల్లే టీడీపీ పేట సీటు ఆశించారు.
తొలుత టీడీపీలో…..
అక్కడ అప్పటి మంత్రి పుల్లారావు ఉన్నారని తెలిసి కూడా బాబు దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే సీటు కావాలని అడిగారు. బాబు నో చెప్పడంతో విడదల రజనీ వెంటనే తన స్థోమత ఉపయోగించి వైసీపీ సీటు దక్కించుకున్నారు. కాలం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. తనకు టికెట్ ఇచ్చి, నియోజకవర్గాన్ని త్యాగం చేసిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్‌పై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కార ణంగా స్థానిక రిపోర్టర్లను కూడా బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆమెపై వచ్చేశాయి.
సొంత సోషల్ మీడియాలో…..
ఇక, తనకే సొంత సామాజిక మీడియాలో వార్తలు రాసేవారిని పెట్టుకునివారితో గోరంతలు కొండంతలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఆమె ఐసోలేషన్ వార్డు ఓపెన్ చేయడం కూడా తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసుకున్న ప్రచారం వికటించేలా ఉందని అంటున్నారు. ఈ విషయం ప్రస్తుతం నియోజకవర్గం , జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విషయం ఏంటంటే జగన్ ఎన్నికల ప్రచారంలో మర్రి రాజశేఖర్ సీటు త్యాగం చేసిన క్రమంలో ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దవ్వడంతో ఆయనకు మరేదైనా పదవి ఇస్తారన్న టాక్ ఉంది. పార్టీ పట్ల, వైఎస్ ఫ్యామిలీ పట్ల దశాబ్దాల విధేయతే మర్రికి ప్లస్.
ఫేక్ ప్రచారంతో…..
అయితే మండలి రద్దవ్వడంతో పాటు ఇద్దరు బీసీ మంత్రులు రాజ్యసభకు ఎంపికవుతోన్న నేపథ్యంలో ఖాళీ అయ్యే కేబినెట్ బెర్త్‌లపై విడదల రజనీ కన్నేశారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోతనకు అనుకూలంగా సోషల్ మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారన్న టాక్ వైసీపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక మర్రి రాజశేఖర్‌కు ఏదైనా పదవి ఇస్తే సహజంగానే ఆమె ప్రయార్టీ తగ్గుతుంది. ఈ ఆందోళనతో తన బూమ్‌ను పెంచు కునేందుకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఫేక్ ప్రచారం నడుస్తుండడం కూడా దీని వెనక ఎవరు ఉన్నారన్న సందేహాలకు కారణమవుతోంది.
జగన్ స్థానంలో…..?
ఇప్పటికే విడదల రజనీ మంత్రి అంటూ జరిగిన ప్రచారానికి కొనసాగింపుగా ఇప్పుడు ఏకంగా విడదల రజనీ కాబోయే సీఎం అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆమె విజన్, ప్రజలకు సేవ చేసే లక్షణం అన్నీ కూడా సీఎంకు ఉండాల్సిన అర్హతలకు ఏమాత్రం తీసిపోవని, పేదల ప్రజలకు అండగా నిలుస్తున్నారని, పార్టీ లైన్‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్నారని, ఇలా అనేక రూపాల్లో ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. వీటిని పరిశీలిస్తున్న వారికి ఒకవిధమైన ఏవగింపు కలుగుతుండడం గమనార్హం. ఇంత అతి అవసరమా ? అని కొందరు పెదవి విరుస్తుండడం గమనార్హం. మరి ఇది తనదాకా వస్తే.. జగన్ ఏం చేస్తారో ? ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇది ఇబ్బంది కాదా ? ఇది ఆమెకు తెలిసే జరుగుతుందా ? లేదా ? అన్నది ఆమె గ్రహించి వీటికి ఫుల్స్టాప్ పెట్టుకుంటే మంచిదంటున్నారు.