ఈయన విషయంలో జగన్ మౌనంగా ఉంటే?
ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా కష్టాల్లో ఉన్నారు. ఇటు న్యాయపరంగా ఆయన చుట్టూ.. అనేక సమస్యలున్నాయి. వీటి నుంచి బయటపడాలన్నా.. లేక [more]
ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా కష్టాల్లో ఉన్నారు. ఇటు న్యాయపరంగా ఆయన చుట్టూ.. అనేక సమస్యలున్నాయి. వీటి నుంచి బయటపడాలన్నా.. లేక [more]
ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా కష్టాల్లో ఉన్నారు. ఇటు న్యాయపరంగా ఆయన చుట్టూ.. అనేక సమస్యలున్నాయి. వీటి నుంచి బయటపడాలన్నా.. లేక వీటి నుంచి తక్షణం ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా.. కూడా కేంద్రంతో సఖ్యత చాలా అవసరం. అదేసమయంలో కొన్ని సామాజిక వర్గాల మద్దతు కూడా అంతే అవసరం. కానీ.. ఇప్పుడు రెండేళ్లు పాలన పూర్తి చేసుకున్న దరిమిలా.. పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అనుసరిస్తున్న వైఖరితో జగన్ ఇబ్బందుల్లో పడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
క్షత్రియ వర్గంలో…
గత ఎన్నికల సమయంలో క్షత్రియ సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలిచింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిని గెలుపు గుర్రం ఎక్కించింది. అయితే.. ఇప్పుడు ఇదే సామాజికవర్గంలో వైసీపీపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తమవుతోంది. టీడీపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయనను దొంగ అంటూ.. వ్యాఖ్యానించడంపై క్షత్రియ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే పత్రికా ప్రకటన ఇచ్చి మరీ.. ఇలాంటివి మున్ముందు చేయొద్దంటూ.. హెచ్చరించింది. కానీ, ఇప్పటి వరకు విజయసాయిరెడ్డిలో ఈ విషయంపై మార్పు కనిపించలేదు.
ఏకంగా స్పీకర్‌కే…?
ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి ఏకంగా.. పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లా పైనే అసహనం.. అసంతృప్తి.. వ్యక్తం చేయడం.. కేంద్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రంలో జగన్ సంపాదించుకున్న అంతో ఇంతో క్రెడిట్.. ఈ వైఖరితో మసకబారుతుందని అంటున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని.. గత ఏడాదే.. వైసీపీ తీర్మానం చేసి.. దీనికి సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
నియంత్రించాలంటూ…..
అయితే.. సాధారణంగా ఇలాంటి విషయాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారు ఆచి తూచి వ్యవహరిస్తారు. త్వరగా నిర్ణయం తీసుకోరు. ఈ క్రమంలో వెయిటింగ్ తప్పదు. అయితే.. తాజగా రఘురామ సభ్యత్వం రద్దు చేయడం లేదని.. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. మీరు పట్టించుకోవడం లేదని.. ఒకింత అసహనంతో విజయసాయిరెడ్డి స్పీకర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సమయంలో ఇలాంటి లేఖలు.. జగన్‌కు ఇబ్బందిగా మారవా? అనేది ప్రశ్న. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని ఆయన నియంత్రించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆయన దూకుడు పార్టీకి మైనస్ అవుతుంటే.. ఆయనలో పరిపూర్ణ రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.