సాయిరెడ్డి వారికి కన్ను గీటుతున్నట్లుందే.. ?
మొత్తానికి విజయనగరం రాజులకు విజయసాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో రెడ్డి గారిని కట్టడి చేయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం [more]
మొత్తానికి విజయనగరం రాజులకు విజయసాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో రెడ్డి గారిని కట్టడి చేయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం [more]
మొత్తానికి విజయనగరం రాజులకు విజయసాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో రెడ్డి గారిని కట్టడి చేయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లాంటి రాజకీయ తటస్తులు జగన్ కి లేఖలు రాసినా సాయిరెడ్డి ఎక్కడా తన నోటి జోరు ఆపడంలేదు అంటే అవన్నీ వైసీపీ రాజకీయ వ్యూహాలే అనుకోవాలి. పూసపాటి రాజుల మీద జనంలో సానుభూతి ఉంది. దాని మీద నెగిటివిటీ పుట్టించాలంటే చరిత్ర పుటలలోకి వెళ్తే సరి అని భావించారో ఏమో కానీ విజయసాయిరెడ్డి హిస్టరీ మాస్టర్ అయిపోయారు. టైమ్ మిషన్ ని పట్టుకుని ఏకంగా 18వ శతాబ్దానికి వెళ్ళిపోయారు. నాడు జరిగిన బొబ్బిలి యుధ్ధంలో విలన్లు విజయనగరం రాజులు అంటూ ఎవరూ అడగకుండానే చరిత్ర పుటలు విప్పి మరీ చెబుతున్నారు.
వారే వీరులట….?
నిజానికి 18వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధంలో విజయనగరం రాజుల మీద విమర్శలు ఉన్నాయి. సాటి రాజుని దెబ్బ తీయడం కోసం ఫ్రెంచ్ సేనాధిపతి బుస్సీ ఆశ్రయాన్ని నాటి పూసపాటి రాజు విజయరామ గజపతి కోరారని చరిత్ర చెబుతోంది. వారి నుంచి అత్యాధునిక ఆయుధాలు తెచ్చుకుని వారి సాయంలో బొబ్బిలి వీరులను దొంగ దెబ్బ తీశారని చరిత్ర కధనం. ఇపుడు ఆ కధనే పట్టుకుని వెన్నుపోటు వీరులు పూసపాటి రాజులు అంటున్నారు విజయసాయిరెడ్డి. ఆ యుద్ధంలో ధైర్యంగా పోరాడి వీరులమనిపించుకున్నది బొబ్బిలి రాజులే అని కితాబు ఇస్తున్నారు. తాండ్రపాపారాయుడు పౌరుషానికి పెట్టింది పేరని కూడా విజయసాయిరెడ్డి కీర్తిస్తున్నారు.
ఆ వారసుడట…..
చరిత్ర ఎలా ఉన్నా ఆధునిక కాలంలో పూసపాటి రాజుల మీద ఏ మచ్చా లేదు. అయితే ఇక్కడ కూడా పూసపాటి పుణ్య పురుషులందు అశోక్ వేరయా అంటున్నారు విజయసాయిరెడ్డి , అశోక్ తండ్రి పీవీజీ రాజు, అన్న ఆనందగజపతిరాజు మాత్రమే ప్రజలకు సేవ చేశారని, వారికి కల్మషం లేదని అంటున్నారు. అశోక్ మాత్రం 18వ శతాబ్దం నాటి విజయరామ గజపతికి సిసలైన వారసుడు అంటూ విమర్శలు సంధిస్తున్నారు. ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవడానికి ఆ ప్రేరణే కారణమని కూడా సెటైర్లు వేస్తున్నారు.
ఒకే గూటిలో…..
బొబ్బిలి రాజులకు, విజయనగరం సంస్థానానికి యుద్ధం వందల ఏళ్ళ క్రితం జరిగింది. ఆ తరువాత వారి వారసులు ఎవరూ కూడా కలసి లేరు. ఆధునిక కాలంలో బొబ్బిలి రాజులు కాంగ్రెస్ లో ఉండేవారు. పీవీజీ రాజు సోషలిస్ట్ పార్టీలో కొనసాగారు. ఇక బొబ్బిలి రాజులు మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. అరవై శతాబ్దం లోనే బొబ్బిలి రాజుల రాజకీయం ఆగిపోయింది. 2004లో వారి వారసుడు సుజయ క్రిష్ణ రంగారావు రాజకీయాల్లోకి వచ్చినపుడు కాంగ్రెస్ నే ఎంచుకోవడం ఇక్కడ గమనార్హం. ఇక పూసపాటి రాజులతో రాజకీయ విభేదాలు ఉన్నా కూడా ఇపుడు ఈ ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. మరి పూసపాటి రాజులను తెగనాడుతూ బొబ్బిలి రాజులను పొగుడుతున్న విజయసాయిరెడ్డి వారికి కన్ను గీటుతున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అదే జరిగితే మరోమారు విజయనగరం జిల్లాలో బొబ్బిలి యుద్ధమే అంటున్నారు.