సాయిరెడ్డిని కంట్రోల్ చేయడానికేనట
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డిని కొంతమేర టీడీపీ కంట్రోల్ చేయగలిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే విజయసాయిరెడ్డి దూకుడు పెంచే వారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని ప్రతి రోజూ [more]
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డిని కొంతమేర టీడీపీ కంట్రోల్ చేయగలిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే విజయసాయిరెడ్డి దూకుడు పెంచే వారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని ప్రతి రోజూ [more]
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డిని కొంతమేర టీడీపీ కంట్రోల్ చేయగలిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే విజయసాయిరెడ్డి దూకుడు పెంచే వారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని ప్రతి రోజూ టార్గెట్ చేసేవారు. ముఖ్యంగా ట్వీట్లతోనే విజయసాయిరెడ్డి ఎక్కువగా విమర్శలు చేసేవారు. ఇవి జనంలోకి బాగా వెళ్లాయని టీడీపీ నేతలు సయితం అంగీకరిస్తారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ల పురాణాన్ని ఆపడం లేదు.
ట్వీట్లకు పెద్దగా స్పందించని…..
విజయసాయిరెడ్డి ట్వీట్లకు తొలినాళ్లలో టీడీపీ నుంచి పెద్దగా స్పందించే వారు కాదు. వర్లరామయ్యో, దేవినేని ఉమ మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడే వారు. దీని వల్ల ఉపయోగం లేదని గ్రహించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం విజయసాయరెడ్డి ట్వీట్లకు సమాధానం చెప్పేందుకు ఇద్దరి నేతలను రంగంలోకి దించింది. విజయసాయిరెడ్డి ఇటు ట్వీట్ పెట్టిన వెంటనే వీరు రంగంలోకి దిగే ఏర్పాట్లు చేశారు. ఇది సత్ఫలితాలనిచ్చిందని టీడీపీ చెబుతోంది.
ప్రత్యేకంగా ఇద్దరు….
విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టిన వెంటనే విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రంగంలోకి దిగిపోతారు. సాయిరెడ్డికి వెంకన్న గట్టి కౌంటర్ ఇస్తారు. చంద్రబాబుపై చేసిన విమర్శకు సమాధానంతో పాటు జగన్ ను వెంకన్న టార్గెట్ చేస్తారు. అలాగే ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కూడా వెంటనే విజయసాయిరెడ్డి ట్వీట్ కు రిప్లై ఘాటుగా ఇస్తారు ఇలా కొంతకాలంగా సాయిరెడ్డి ట్వీట్లకు వీరిద్దరే సమాధానం, రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
ప్రయోజనం ఉందట….
ఇది కొంత ప్రయోజనం చేకూరిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయిరెడ్డి ట్వీట్లు ప్రజల్లోకి బలంగా వెళుతుండటంతో ఇప్పుడు కౌంటర్ ట్వీట్లు కూడా అదే స్థాయిలో వెళుతున్నాయని టీడీపీ అభిప్రాయపడుతోంది. అలా వదిలేస్తే నష్టమని భావించిన పార్టీ హైకమాండ్ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇవ్వాలని కొందరి నేతలను కోరగా వారు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిని విజయసాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా టీడీపీ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద సాయిరెడ్డిని ట్వీట్ల పరంగా కంట్రోల్ చేయడానికి టీడీపీ చేసిన ప్రయోగం ఫలించినట్లేనంటున్నారు.