సాయిరెడ్డితో బూమ్ రాంగ్ తప్పదా?
29వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి ప్లస్సా..? మైనస్సా? ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి ఎప్పుడూ చేసే కామెంట్లు హాట్ హాట్ గా ఉంటాయి. ఇటు ట్విట్టర్ లోనూ, [more]
29వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి ప్లస్సా..? మైనస్సా? ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి ఎప్పుడూ చేసే కామెంట్లు హాట్ హాట్ గా ఉంటాయి. ఇటు ట్విట్టర్ లోనూ, [more]
29వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి ప్లస్సా..? మైనస్సా? ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి ఎప్పుడూ చేసే కామెంట్లు హాట్ హాట్ గా ఉంటాయి. ఇటు ట్విట్టర్ లోనూ, అటు మీడియా సమావేశాల్లోనూ నేరుగా ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. విజయసాయిరెడ్డి ఒక వ్యాఖ్య చేేశారంటే అది జగన్ చేసినట్లే అని భావించేవారు అనేక మంది ఇటు పార్టీలోనూ, సాధారణ ప్రజల్లోనూ ఉన్నారు. విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడతారని, అందులో సక్సెస్ అవుతుంటారని వైసీపీ నేతలు భావిస్తుంటారు.
ఆయన కామెంట్స్ తో…..
కానీ ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పుపట్టే విధంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్నటి వరకూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడారు. అందులో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా ఆయన చేసిన ప్రచారాన్ని జనం కూడా నమ్మారనే అనుకోవాలి.
కన్నా ఉండగా…..
అంతేకాదు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేశారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా మీడియా ముఖంగా జరిగింది. ఇక తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన పురంద్రీశ్వరిని కూడా విజయసాయిరెడ్డి టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. పురంద్రీశ్వరి పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు, మేధావులు సయితం తప్పుపడుతున్నారు.
పురంద్రీశ్వరి పై……
పురంద్రీశ్వరి ఒక ఇంటర్వ్యూలో అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పారు. నిజానికి ఇది బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయం కూడా. కానీ విజయసాయిరెడ్డి తమ జాతి ప్రయోజనాల కోసం పురంద్రీశ్వరి ఇలా అన్నారంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డ్ గా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గంపై విజయసాయిరెడ్డి ప్రతిసారీ చేస్తున్న కామెంట్స్ ప్లస్ అయ్యాయేమో కాని, పురంద్రీశ్వరి మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీకి తీవ్ర నష్టం కల్గించేవేనని చెప్పకతప్పదు. ప్రతి అంశానికి సామాజికవర్గంతో ముడిపెట్టడం తగదని విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.