విజయసాయి హ్యాండిల్ చేయలేకపోతున్నారా ?
విజయసాయిరెడ్డి పవర్ అయిపోయిందా. ఆయన సత్తా అంతా చూపించేశారా. ఇక ఆయన పావులు కదిపినా ప్రత్యర్ధులు జడిసిపోవడం లేదా. అంటే సీన్ చూస్తే అలాగే ఉంది. విశాఖకు [more]
విజయసాయిరెడ్డి పవర్ అయిపోయిందా. ఆయన సత్తా అంతా చూపించేశారా. ఇక ఆయన పావులు కదిపినా ప్రత్యర్ధులు జడిసిపోవడం లేదా. అంటే సీన్ చూస్తే అలాగే ఉంది. విశాఖకు [more]
విజయసాయిరెడ్డి పవర్ అయిపోయిందా. ఆయన సత్తా అంతా చూపించేశారా. ఇక ఆయన పావులు కదిపినా ప్రత్యర్ధులు జడిసిపోవడం లేదా. అంటే సీన్ చూస్తే అలాగే ఉంది. విశాఖకు 2015లో వచ్చిన విజయసాయిరెడ్డి వైసీపీకి మరచిపోలేని విజయాలే అందించారు. ఆయన వచ్చాకనే పార్టీ గాడిన పడింది. అసలు ఏమీ కాని చోట టీడీపీ బలంగా ఉన్న చోట అనితరసాధ్యమైన విజయాలను ఆయన వైసీపీకి అందించారు. 2019 ఎన్నికల్లో విశాఖలో సిటీలో నాలుగు తప్ప రూరల్ జిల్లా అంతా కలిపి 11 సీట్లను వైసీపీ పరం చేయడంతో విజయసాయిరెడ్డి వ్యూహాలూ, రాజకీయ చాతుర్యాలు చాలానే ఉన్నాయి.
దారిని రాని తమ్ముడు…..
విజయసాయిరెడ్డి రూరల్ వరకూ బాగానే వైసీపీని తీర్చిదిద్దినా సిటీలో మాత్రం ఆయన టీడీపీని దెబ్బతీయలేకపోతున్నారు. అందుకోసం ఆయన రచించిన పధకాలు కూడా ఎక్కడికక్కడ ఫెయిల్ అవుతున్నాయి. ఆయన విశాఖలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. అందులో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జై కొట్టారు. గంటా శ్రీనివాసరావు, గణబాబు సైలెంట్ అయ్యారు. కానీ వెలగపూడి రామక్రిష్ణ బాబు మాత్రం ఏకంగా విజయసాయిరెడ్డికే సవాల్ చేశారు. దాంతో విజయసాయిరెడ్డిని ఎదిరించిన ఒకే ఒక్కడిగా ఆయన టీడీపీలో గట్టిగా కనిపిస్తున్నారు.
అక్కడే మైనస్ …
ఇక పార్టీలో లుకలుకలు కూడా విజయసాయిరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సొంత పార్టీలో కూడా కబ్జా చేసేవారు ఉన్నారు. దాంతో వారంతా విజయసాయిరెడ్డి మీద గుర్రు మీద ఉన్నారు. జగన్ వద్దనే తేల్చుకుంటామని కూడా అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రాలోని నేతలకు సామాజిక వర్గాల పరంగా ఉన్న సాన్నిహిత్యం పార్టీలను దాటి ముందుకు సాగుతుంది. దాంతో అటూ ఇటూ కూడా విజయసాయిరెడ్డికి శత్రువులు పెరిగారు. ఈ పరిణామంతో ఆయన వైసీపీని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.
వీసా అయిపోయిందట….
విజయసాయిరెడ్డి ఈ మధ్య కాలం దాకా టీడీపీ కంట్లో నలుసుగా మారారు. ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారో అని తమ్ముళ్ళలో కలవరం చెలరేగేది. కానీ ఇటీవల సొంత పార్టీలో కూడా వ్యతిరేకత పెరగడంతో విజయసాయిరెడ్డికి పరపతి తగ్గిందని టీడీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. విశాఖకు వలస వచ్చిన విజయసాయిరెడ్డి వీసా అయిపోయింది ఇక పెట్టే బేడా సర్దుకోవచ్చు అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. నిజంగానే విజయసాయిరెడ్డిని జగన్ ఉత్తరాంధ్రా జిల్లాల బాధ్యతల నుంచి తప్పిస్తారా అన్న చర్చ అయితే వైసీపీలో సాగుతోందిట. చూడాలి మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో.