కేంద్ర సర్కారులోకి జగన్.. సాయిరెడ్డికి కీలక పదవి.. నిజమేనా…?
కేంద్ర ప్రభుత్వంలో పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. పార్లమెంటులో బలం ఉన్నప్పటికీ.. కేంద్రానికి అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత భారీగా ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలను తనదైన [more]
కేంద్ర ప్రభుత్వంలో పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. పార్లమెంటులో బలం ఉన్నప్పటికీ.. కేంద్రానికి అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత భారీగా ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలను తనదైన [more]
కేంద్ర ప్రభుత్వంలో పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. పార్లమెంటులో బలం ఉన్నప్పటికీ.. కేంద్రానికి అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత భారీగా ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలను తనదైన దారిలోకి తెచ్చుకోవాలనుకున్న మోడీ వ్యూహం ఎక్కడా ఫలించడం లేదు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారం తిరిగి ఇవ్వకుండా.. రాష్ట్రాలనే అప్పులు చేసుకోవాలని సూచించడంపై తెలంగాణ , తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు సహా.. ఇతర రాష్ట్రాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి.
మద్దతుదారు అవసరం…
ఇక, విద్యుత్ ఒప్పందాలను తిరిగి సమీక్షించరాదన్న నిర్ణయంపై తెలంగాణ సీఎం ఏకంగా.. అసెంబ్లీలోనే ఇటీవల వ్యతిరేకిస్తూ.. తీర్మానం చేశారు. ఇక, ఇప్పుడు తాజాగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయరంగ సంస్కరణల బిల్లును దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు బలమైన మద్దతుదారు అవసరం. పార్లమెంటులో సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. మద్దతుగా నిలిచే పార్టీ అంటూ అవసరం ఏర్పడింది. పైగా ఎన్డీయే కూటమిలోని శిరోమణి అకాలీదళ్ తన మద్దతును దాదాపు ఉపసంహరించింది.
ఇప్పుడు జగన్ ఒక్కరే….
ఈ క్రమంలోనే మోడీ చూపు ఏపీపై పడిందని అంటున్నారు. ఏపీలో జగన్ పార్టీకి 22 ( ఒకరు మృతి చెందారు) మంది ఎంపీలుఉన్నారు. పైగా కేంద్రం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకూ జగన్ జై కొడుతున్నారు. జీఎస్టీ పరిహారం ఇవ్వకపోయినా.. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించరాదని చెప్పినా.. వ్యవసాయ బిల్లు తెచ్చినా.. జగన్ మోడీకి మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..దక్షిణాదిన ఇప్పుడున్న పరిస్థితిలో మోడీకి అండగా ఉన్న నాయకుడు.. జగన్.. పార్టీ వైసీపీ.
విజయసాయికి పదవి ఇచ్చి…..
ఈ నేపథ్యంలోనే జగన్ పార్టీని ఎన్డీయేలోకి తీసేసుకుంటే బెటర్ అనే ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్ను చేర్చుకుని, కేంద్రంలో విజయసాయిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా దక్షిణాది మొత్తం ఏకమైనా.. పార్లమెంటులో విమర్శలు తగ్గుతాయని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుంది? మోడీ వ్యూహానికి జగన్ సహకరిస్తారా? వంటి అనేక సందేహాలు మాత్రం ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- modi
- à°®à±à°¦à±