బెజవాడలో అంతేనండి…ఇప్పుడూ రాజకీయాలే?
ప్రస్తుతం కరోనా కోరల్లో ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ప్రజలకు సేవ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక, [more]
ప్రస్తుతం కరోనా కోరల్లో ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ప్రజలకు సేవ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక, [more]
ప్రస్తుతం కరోనా కోరల్లో ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ ప్రజలకు సేవ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక, దేశంలోనూ ప్రధాని నరేంద్రమోదీతో ఎప్పుడూ విభేదించే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పుడు కలిసి వచ్చింది. మోడీ తీసుకు న్న లాక్డౌన్ నిర్ణయాన్ని, ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఇచ్చిన లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీ ని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. తమ వంతుగా కాంగ్రెస్ ఎంపీలు ఒక నెలవేతనాన్ని అందించారు. ఇక, తెలంగాణలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. నిత్యం కేసీఆర్‌ను తిట్టిపోయే కోమటిరెడ్డి తన వేతనాన్ని కేసీఆర్‌కు అందించారు.
ఇక్కడా రాజకీయాలే….
అంతేకాదు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన ప్రశంసించారు. లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని సూచించారు. మరి ఇలాంటి స్ఫూర్తి ఏపీలో ఉందా ? అంటే.. పైకి మాటల రూపంలోనే ఉంది. టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు తనకు ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉందని చెబుతారు. అయితే, ఈ క్లిష్ట సమయంలో తమ్ముళ్లను ప్రజలకు సాయం చేయించే విషయంలో మాత్రం చతికిల పడ్డారు. కరోనా లోపాలను కూడా ఆయన రాజకీయంగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలావుంటే, రాజకీయ రాజధాని విజయవాడలో తమ్ముళ్లు, వైసీపీ నేతల మధ్య రాజకీయాలు మరింతగా రాజుకున్నాయి. ఈ సమయంలో కరోనాను తిప్పికొట్టేందుకు నాయకులు చేతులు కలిపి ప్రజలకు సేవచేయాల్సి ఉన్నప్పటికీ.. అలా చేయడం లేదు.
ఎవరికి వారే…
పైగా.. నేతలు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. అధికార పార్టీ నేతలు అడపా దడపా అయినా కనిపిస్తుంటే.. టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎక్కడా బయటకు రావడం లేదు. అధికార పార్టీలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుకు పొసగడం లేదు. ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారు. మల్లాది విష్ణు ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంటికే పరిమితమయ్యారు. మంత్రి కూడా తన దారితనే చూసుకుంటున్నారు. ఇక ఎంపీగా పోటీ చేసి ఓడిన పీవీపీ ఎప్పుడు ఎక్కడ ? ఉంటారో ? ఆయనకే తెలియని పరిస్థితి. ఇక తూర్పులోనూ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్‌కు నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌కు పడడం లేదు. ఇక ఇక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వర్గం పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి.
యాక్టివ్ గా ఉన్న వాళ్లు కూడా….
ఇక టీడీపీలో యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కానీ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కానీ, ప్రజలకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. ఇక బుద్ధా వెంకన్న ట్విట్టర్ పిట్టగా మారిపోయారు. ట్విట్టర్లో విమర్శలు చేయడం మినహా ఆయన చేసేదేం ఉండడం లేదని సొంత పార్టీలోనే కొందరు చెవులు కొరుక్కుంటోన్న పరిస్థితి. ఇక ఎంపీ కేశినేని నాని ఏ అంశంపై స్పందించినా ఆయన దారి ఆయనదే అన్నట్టుగా ఉంది. ఏదేమైనా ఇలాంటి సమయంలో అయినా కీలకమైన విజయవాడ నగరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఈ కీలక నేతలు అంతా తమలో తమ రాజకీయ విబేధాలు పక్కన పెట్టి ఒకే తాటిమీదకు వచ్చి ప్రజలకు ధైర్యం చెపితే బాగుంటుంది. మరి ఈ నేతలు ఈ విషయం తలకెక్కించుకుంటారో ? లేదో ? చూడాలి.