అమరావతి పైత్యం .. పత్రికలు ఇందుకు?
విజయవాడ అనే పేరు కల. మా ఊరు కనిపించడం లేదు. మా ఊరి పేరు పత్రికల్లో మెల్లగా మాయమైపోతోంది. విజయవాడ డేట్ లైన్ తగ్గిపోయి చాలా రోజులైనా, [more]
విజయవాడ అనే పేరు కల. మా ఊరు కనిపించడం లేదు. మా ఊరి పేరు పత్రికల్లో మెల్లగా మాయమైపోతోంది. విజయవాడ డేట్ లైన్ తగ్గిపోయి చాలా రోజులైనా, [more]
విజయవాడ అనే పేరు కల. మా ఊరు కనిపించడం లేదు. మా ఊరి పేరు పత్రికల్లో మెల్లగా మాయమైపోతోంది. విజయవాడ డేట్ లైన్ తగ్గిపోయి చాలా రోజులైనా, ఈ మధ్య మెయిన్ ఎడిషన్ లలో ఒక్క వార్త కూడా విజయవాడ పేరుతో కనిపించకపోవడం దురదృష్టకరం. విజయవాడ అమరావతిలో ఉందా? అమరావతిలో విజయవాడ భాగమా? ఈ ప్రశ్న చాలా సార్లు వచ్చినా సమాధానం రాదు కాబట్టి ఊరుకోవాల్సి వచ్చింది. ఎడిషన్ వరకే కాకుండా వార్తల్లో కూడా మా బెజవాడ పేరుకు మళ్ళీ పత్రికల్లో చోటు కల్పించే రోజులు రావాలని కోరుకుంటూ….. టీవీ స్క్రోలింగ్ లలో కూడా విజయవాడ వార్తల్ని విజయవాడ వాటిగానే పరిగణించాలని ప్రార్థన.
ఆ పేరు పెట్టింది….
2014చివర్లో చంద్రబాబు రాజధాని ఏర్పాటు అయ్యే ప్రాంతాన్ని నిర్దారించాక., 2015 ద్వితీయార్థంలో ల్యాండ్ పూలింగ్ జరిగే ప్రాంతానికి అమరావతి అనే పేరును ఈనాడు రామోజీ రావు నిర్ణయించారు. ఇది తమ కృషి అని కొన్ని సంఘాలు సంబర పడ్డాయి. కానీ అమరావతిలో ఆ పక్కనే ఉన్న అమరావతి శైవ క్షేత్రానికి కానీ, బౌద్ధానికి కానీ మన బాలయ్య బాబు గౌతమీ పుత్ర శాతకర్ణి స్టోరీకి కానీ ఎక్కడా లింక్ దొరకదు. జస్ట్ కృష్ణా తీరంలో దానికి ఓ తాడు కట్టి జనంలో సెంటిమెంట్ అల్లారు. దానికి ఈనాడు మద్దతు లభించింది.
ఏం సంబంధం?
మిగతా పత్రికలు ఆ తోక పట్టుకుని సాగుతున్నాయి. 2017లో అనుకుంటా.. విజయవాడలో మొదలు పెట్టిన ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో ఇదే డేట్ లైన్ తో వార్తలు మొదలయ్యాయి. అది గమనించిన ఆ పత్రిక ఎడిటర్ ఇది ఎక్కడ ఉందని అప్పట్లో బాధ్యుల్ని నిలదీశారు. చంద్రబాబు వీరాభిమాని అయిన సదరు వ్యక్తి ఎదో స్టోరీ చెప్పేలోపు ఇకపై అలా జరగడానికి అలా తేల్చేశారట. అమరావతి నగరం ఎక్కడ ఉంది? దానికి ఉన్న గుర్తింపు ఏమిటి? ఊహాజనిత నగరాల ప్రాతిపదికగా పత్రికల్లో డేట్ లైన్ ఇవ్వడం సాధ్యమేనా? ఎడిషన్ విజయవాడ అయితే వార్తలు అమరావతి ఎలా అవుతాయి? ప్రభుత్వ ఒత్తిడి ఉంటే కోర్ క్యాపిటల్ అంటే 29గ్రామాలకు సంబంధించిన వార్తలకు మాత్రమే ఆ డేట్ లైన్ పరిమితం కావాలని స్పష్టం చేశారట. మన తెలుగు పత్రికలకు అంత సోయి ఎక్కడ ఉంది. ఎద్దు ఈనింది అంటే దూడని కట్టేయడమే వాళ్ళకి తెలుసాయే.