కెప్టెన్ రాజకీయంగా పనికిరారా?
కొందరు అంతే… సినిమాల్లో డైలాగులు చెప్పడానికే పనికొస్తారు. నిజజీవితంలో అది ఫేక్ అని తేలుతుంది. సినీరంగం నుంచి వచ్చిన రాజకీయ నేతల సంగతి అసలు చెప్పాల్సిన పనిలేదు. [more]
కొందరు అంతే… సినిమాల్లో డైలాగులు చెప్పడానికే పనికొస్తారు. నిజజీవితంలో అది ఫేక్ అని తేలుతుంది. సినీరంగం నుంచి వచ్చిన రాజకీయ నేతల సంగతి అసలు చెప్పాల్సిన పనిలేదు. [more]
కొందరు అంతే… సినిమాల్లో డైలాగులు చెప్పడానికే పనికొస్తారు. నిజజీవితంలో అది ఫేక్ అని తేలుతుంది. సినీరంగం నుంచి వచ్చిన రాజకీయ నేతల సంగతి అసలు చెప్పాల్సిన పనిలేదు. తాము చెప్పే మాటలు వారికి అసలు గుర్తే ఉండవు. తమిళనాడు ఎన్నికల వేళ మరోసారి ఇది స్పష్టమయింది. ఒంటరిగా బరిలోకి దిగుతామని డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఒంటరిపోరు అచ్చిరాదని మరొక పార్టీతో సర్దుబాటు చేసుకున్నారు.
ఇద్దరూ అంతే….
తమిళనాడులో విజయ్ కాంత్ కు ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కమల్ హాసన్, రజనీకాంత్ లు ఇద్దరూ రాజకీయ పార్టీలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కమల్ హాసన్ కూడా ఒంటరిగా వెళ్లేందుకు వెనుకంజ వేశారు. ఆయన తృతీయ కూటమిని ఏర్పాటు చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ప్రజల ముందుకు వెళుతున్నారు. మరోవైపు విజయ్ కాంత్ మొన్నటి వరకూ అన్నాడీఎంకే కూటమిలో ఉండేవారు.
కూటమి నుంచి వైదొలిగి…..
అయితే అన్నాడీఎంకే కూటమి తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ఆశించిన స్థానాలను ఇచ్చేందుకు నిరాకరించడంతో విజయ్ కాంత్ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. కనీసం నలభై స్థానాలను కోరితే పదహారు స్థానాలను మించి ఇవ్వలేమని అన్నాడీఎంకే తేల్చి చెప్పడంతో విజయకాంత్ ఆ కూటమికి కటీఫ్ చెప్పేశారు. తన పార్టీకి చెందిన 234 నియోజకవర్గాల నేతలతో విజయ్ కాంత్ సమావేశమయ్యారు.
ఒంటరిగా పోటీ చేయడానికి…..
ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారు. కానీ ఎందుకో సాహసించలేకపోయారు. ఆరోగ్య కారణాలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒంటరిగా పోటీ చేసి సాధించేదేమీ లేదని విజయ్ కాంత్ గ్రహించారు. అందుకే తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పార్టీకి శశికళ కూడా ప్రచారం చేయడం లేదు. అయినా విజయ్ కాంత్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 60 స్థానాలను దక్కించుకున్నారు. మొత్తం మీద కెప్టెన్ గా పేరొందిన విజయ్ కాంత్ రాజకీయ పార్టీకి మాత్రం సరైన కెప్టెన్ గా వ్యవహరించలేకపోతున్నారు.