కోహ్లీ పై దుమ్ము దుమారం
విరాట్ కోహ్లీ పై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. వరల్డ్ కప్ టోర్నీ ముగిశాక, రోహిత్ శర్మ జట్టులో జరుగుతున్న బాగోతం బయటపడ్డాక కెప్టెన్ విరాట్ కోహ్లీ [more]
విరాట్ కోహ్లీ పై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. వరల్డ్ కప్ టోర్నీ ముగిశాక, రోహిత్ శర్మ జట్టులో జరుగుతున్న బాగోతం బయటపడ్డాక కెప్టెన్ విరాట్ కోహ్లీ [more]
విరాట్ కోహ్లీ పై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. వరల్డ్ కప్ టోర్నీ ముగిశాక, రోహిత్ శర్మ జట్టులో జరుగుతున్న బాగోతం బయటపడ్డాక కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరు వివాదాస్పదంగా మారిపోయింది. విరాట్ కోహ్లీ నిర్ణయాలవల్లే ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకోలేకపోయామన్న విమర్శలు ఒక్కసారిగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ ను మార్చాలన్న డిమాండ్ కి మద్దతు పెరిగిపోయింది. దీనిపై మాజీ క్రికెటర్ల నడుమ మాటల యుద్ధం ట్విట్టర్ లో ఒకరేంజ్ లో నడుస్తుంది.
సన్నీ అలా సంజయ్ ఇలా …
బిసిసిఐ జట్టును కంట్రోల్ చేస్తుందా లేక విరాట్ కోహ్లీ బోర్డు ను కంట్రోల్ చేస్తున్నాడా అని ప్రశ్నలు సంధించాడు సునీల్ గవాస్కర్. విరాట్ కోహ్లీ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు సన్నీ. కోచ్ ఎవరుండాలి అనేదానిపైనా విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు పై ఆయన విరుచుకుపడ్డారు. ఇక సన్నీ వ్యాఖ్యలను మాజీ క్రికెటర్, కామెంట్రేటర్ సంజయ్ మంజ్రేకర్ ఖండించారు. వరల్డ్ కప్ లో భారత ప్రదర్శన బాగానే ఉందని విరాట్ కోహ్లీ ని సమర్ధిస్తూ ట్వీట్ కొట్టారు.
మౌనంగా రోహిత్….
ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే విరాట్ కోహ్లీ ని విమర్శించారు. కోచ్ కి దరఖాస్తు చేసుకోవాలని బిసిసిఐ చెప్పాక కెప్టెన్ తన ప్రాధాన్యత రవిశాస్త్రి అని పేర్కొనడం సరైనది కాదని హితవుపలికారు. మరోపక్క విరాట్ కోహ్లీని దించేయాలన్న డిమాండ్ కి అత్యధికులు మద్దతు పలుకుతుంటే కొనసాగాలని మాత్రం కొంత శాతమే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇంతటి వివాదానికి కారణమైన రోహిత్ శర్మ మాత్రం ఈ వ్యవహారాన్ని మౌనంగా గమనిస్తూ ఉండటం గమనార్హం.