జగన్ మీద రాజు గారికి అందుకేనా గుర్రు ?
జగన్ మంచి నాయకుడు అని చాలా సార్లు పొగిడింది బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజే. ఆయనకు జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం నచ్చింది. [more]
జగన్ మంచి నాయకుడు అని చాలా సార్లు పొగిడింది బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజే. ఆయనకు జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం నచ్చింది. [more]
జగన్ మంచి నాయకుడు అని చాలా సార్లు పొగిడింది బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజే. ఆయనకు జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం నచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదన నచ్చింది. జగన్ డైనమిక్ నేచర్ కూడా నచ్చింది. ఇలా బోల్డ్ గా పక్క పార్టీలో ఉంటూ జగన్ కి అనూహ్యమైన మద్దతు ఇచ్చిన నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నో సార్లు మీడియాకు ఎక్కారు. ఇపుడు అటువంటి రాజు గారిలో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. జగన్ మీద ఒక రేంజిలో ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కూడా చేయని కామెంట్స్ రాజు చేయడమే ఇపుడు విశేషం.
జైలులో ఉండాల్సిందేనా…?
జగన్ కోర్టు తీర్పులు ఆలస్యం కావడం వల్లనే ఇంకా సీఎం సీట్లో ఉన్నారని విష్ణు కుమార్ రాజు తాజాగా అనడం అతి పెద్ద విమర్శగా చూడాలి. దీని అర్ధం జగన్ తప్పు చేశాడు. అవినీతి చేశాడు అని కోర్టులలో తీర్పులు రావడం కంటే ముందే విష్ణుకుమార్ రాజు అంచనాకు వచ్చారనుకోవాలేమో. జగన్ మీద 31 క్రిమినల్ కేసులు. 11 సీబీఐ, 5 ఈడీ కేసులు ఉన్నాయట. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మీద ఇన్నేసి కేసులు లేవట. పోనీ ఇదంతా నిజమే అనుకున్నా ఇవన్నీ కూడా 2014 ముందు కూడా ఉన్నాయి కదా. మరి నిన్నటి దాకా జగన్ని పొగిడిన విష్ణుకుమార్ రాజులో ఇంత తేడా ఇపుడే ఎందుకు వచ్చింది అన్నదే చర్చగా ఉంది.
అదేనా విషయం….
జగన్ విశాఖ భూ ఆక్రమణల మీద మూడవ కన్నే తెరిచారు. వారూ వీరూ అన్న తేడా లేకుండా అక్రమం అని తెలిస్తే చాలు లేపేస్తున్నారు. ఈ క్రమంలో రుషికొండ వద్ద ఉన్న విష్ణుకుమార్ రాజు కు చెందిన ఒక రిసార్ట్స్ పక్కనే ఉన్న ప్రేమ సమాజం స్థలాన్ని కూడా దేవాదాయ శాఖకు స్వాధీనం చేయించారు. ఈ స్థలం విషయంలో రిసార్ట్స్ పరంగా విస్తరణకు విష్ణుకుమార్ రాజు ప్లాన్స్ వేసుకున్నారని అంటున్నారు. దాంతో రాజుకు ఇపుడు ఒక్కసారిగా జగన్ మీద మండుకు వస్తోంది, అందుకే ఆయన జగన్ ని గట్టిగా తగులుకుంటున్నారని అంటున్నారు. మరి ఇదే నిజమైతే జగన్ లోని విచిత్రమైన మనిషి రాజుకు కనిపించడంలో ఆశ్చర్యం లేదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.
అది కూడానా…?
ఇక విష్ణుకుమార్ రాజు ఆ మధ్యంతా జగన్ అపాయింట్ మెంట్ కోసం ట్రై చేశారని తెలుస్తోంది. జగన్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న బాధ కూడా ఉందిట. దాన్ని ఆయన మీడియా పరంగా కూడా చెప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనకు జగన్ కలిసే అవకాశం ఇవ్వలేదని కూడా బాధపడ్డారు. మరి తనను కలసి ఆయన ఏం చేప్పేవారో ఏం మాట్లాడేవారో ఈ మొహమాటాలు గొడవలు ఎందుకు అని జగన్ అనుకున్నారో ఏమో కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీలో చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే విశాఖ బీజేపీ నుంచి మరో చంద్రబాబు మాదిరిగా రాజు కూడా జగన్ మీద గట్టిగా నోరు చేసుకుంటున్నారు. జగన్ జైలులో ఉండాలని కోరుకుంటున్న వారిలో ఆయన ముందుంటున్నారు.