Ycp : ఆల్ రెడీ ఈ రెడ్డికి ఆ పదవి ఖరారయిందా?
త్వరలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. దాదాపు 14 మందిని జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 మంది [more]
త్వరలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. దాదాపు 14 మందిని జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 మంది [more]
త్వరలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. దాదాపు 14 మందిని జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో 11 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్నారు. అందరూ వైసీపీకి చెందిన వారే ఎన్నికవుతారు. ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి ఖచ్చితంగా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటున్నారు. ఆయనకు ఆల్ రెడీ ఎమ్మెల్సీ పదవి రిజర్వ్ అయిందని చెబుతున్నారు.
ప్రారంభం నుంచి…
ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వర్ రెడ్డి తొలి నుంచి జగన్ తో ఉన్నారు. ఆయన 2014లో గెలిచినా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో ఓటమిని చవి చూశారు. ప్రస్తుతం ఉరవకొండ వైసీపీ ఇన్ ఛార్జిగా వ్వవహరిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో ఇక్కడ రెండు గ్రూపులయ్యాయి. ఒకటి విశ్వేశ్వర్ రెడ్డి గ్రూపు కాగా, రెండు మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డిది.
విడివిడిగానే….
ఇద్దరూ విడివిడిగానే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇద్దరూ తమ వారసుల కోసం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో జగన్ వీరిలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు. శివరామిరెడ్డి వర్గం కూడా ఇక్కడ బలంగా ఉంది. రెండు వర్గాలు ఐక్యంగా పనిచేస్తే 2024 ఎన్నికల్లో ఉరవకొండలో వైసీీపీ జెండా ఎగరడం ఖాయం. అందుకే విశ్వేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.
రెండు గ్రూపులను….
అనంతపురం జిల్లాలో గత ఎన్నికలలో ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయింది. హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పటికే ఇచ్చారు. దీంతో విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీ చేసి ఉరవకొండలోని వైసీపీలో గ్రూపులకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శివరామరెడ్డి కుటుంబానికి ఉరవకొండ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.