కాల్ మర్జింగ్ స్కాం.. నిమిషాల్లో డబ్బు మాయం
నేటి కాలంలో సైబర్ నేరాల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజుకో వేషంతో మోసాలకు పాల్పడుతున్నారు. మన

నేటి కాలంలో సైబర్ నేరాల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజుకో వేషంతో మోసాలకు పాల్పడుతున్నారు. మన అమాయకత్వం, అలక్ష్యాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. దైనందిన జీవితంలో టెక్నాలజీ ని అందరూ ఎన్నో విషయాలలో వాడుతున్నారు. దీనితో ఎన్నో పనులు సులువుగా అయిపోతున్నాయి. కానీ టెక్నాలజీ ని వాదుకొని అమాయకులను మోసం చేసేందుకు స్కామర్లు దారులు వెతుక్కుంటున్నారు. సాధారణంగా ఓటీపీలు, ఇతర వివరాలు షేర్ చేయకూడదనే విషయం అందరూ తెలుసుకోవడంతో మోసాలు చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు.
కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సైబర్ దాడులు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఉద్ధృతి 5 రెట్లకు ఎగబాకిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య నిరంతర సమాచార మార్పిడితో ఎక్కడికక్కడ చోర బృందాల భరతం పట్టేలా చేయాలి. ఉమ్మడి కార్యదళం అవతరణ- అంతర్జాల ఉగ్రవాద పీడకు సరైన విరుగుడు అవుతుంది!
ప్రస్తుతం దేశంలో కొత్తగా Call Merging Scam జరుతోందంటూ NCPI అందరినీ హెచ్చరిస్తోంది. ఈ స్కామ్ గురించి UPI అధికారిక X అకౌంట్ నుంచి అలర్ట్ ను జారీ చేసింది. అంతేకాదు, ఈ కొత్త స్కామ్ గురించి అందరికి తెలిసేలా ఈ పోస్ట్ ను షేర్ చేయాలనీ కూడా రిక్వెస్ట్ చేస్తోంది. మరి ఈ కొత్త స్కామ్ ఎలా జరుగుతోందో, దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
కాల్ మర్జింగ్ స్కాం లో సైబర్ నేరగాళ్లు ఊఫీ వినియోగదారులను మోసగాళ్లు కాల్ మెర్జ్ చేస్తామంటూ తెలియకుండానే వారి వన్ టైం పాస్ వర్డ్ ను తీసుకుని మోసం చేస్తున్నారు, బ్యాంక్ ఖాతాలు లూటీ చేస్తూన్నారు.
అసలు ఏమిటి ఈ Call Merging Scam?
మీ స్నేహితుడి ఫోన్ నుంచి కాల్ చేస్తున్నానంటూ ఒక అపరిచితుడు మిమ్మల్ని ముగ్గు లోకి దింపుతారు. సిటీ లో జరగబోతున్న అప్ కమింగ్ బిగ్ ఈవెంట్ కోసం మీ నెంబర్ మీ ఫ్రెండ్ ఇచ్చారు, మీ కాల్ ను మెర్జ్ చేయమన్నారు అని కోరుతారు.
ఈ కాల్ మెర్జ్ కోసం లేదా ఈవెంట్ రిజిస్టర్ కోసం మీ నెంబర్ కు ఒక OTP వస్తుందని అడుగుతారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ ఫ్రెండ్ కొత్త నెంబర్ తో కాల్ మెర్జ్ చేస్తున్నారు అని కూడా చెబుతారు. వాస్తవానికి, ఇది ఫ్రెండ్ కాల్ కాదు బ్యాంక్ OTP కాల్. ఈ కాల్ ద్వారా OTP అందుకుని అకౌంట్ ను ఖాళీ చేస్తారు.
ఇటీవల కాలంలో ఈ స్కామ్ ఎక్కువగా జరుగుతున్నట్లు NPCI అలర్ట్ జారీ చేసింది. NPCI అండర్ లోని UPI అధికారిక X అకౌంట్ నుంచి ఈ అలర్ట్ వివరాలు షేర్ చేసింది. ఈ మెసేజ్ వీలైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయాలని కూడా విన్నవించింది.
అనుమానం వస్తే ఏమి చేయాలి?
తెలియని నంబర్ నుంచి కాల్స్ ను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. అలా అని ఎవరైనా అభ్యర్ధిస్తే జాగ్రత్త పడండి.
ఎవరైనా మీ బ్యాంక్ లేదా తెలిసిన కాంటాక్ట్ ద్వారా మాట్లాడుతున్నామని చెప్తే, విలువైన సమాచారం షేర్ చేసే ముందు వారు నిజం చెప్తున్నరా లేదా అనేది నిర్ధారించుకోవాలి. మీరు ప్రారంభించని లావాదేవీ కి OTP వస్తే మీ బ్యాంక్ ను అప్రమత్తం చేయండి.
స్కామ్ జరిగినట్లు లేదా మీకు వచ్చిన కాల్ స్కామర్లు చేసిన కాల్ గా మీకు అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయండి, అని కూడా UPI పోర్టల్ చెబుతోంది. అంతేకాదు, ఇటువంటి మోసాలను cybercrime.gov.in లో నేరుగా కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా దేశంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. అయితే, డిజిటల్ అరెస్ట్ అనేది పెద్ద బూటకపు మాట. ఇటువంటి కాల్స్ మీరు మీ నెంబర్ పై అందుకున్నట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాల్ కట్ చేసి వెంటనే 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి.