ఆ పాపం రెండు పత్రికలు ఇప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ముందుంటాయి. విరాళాలను సేకరిస్తుంటాయి. బాధితుల కోసం ఈనాడు అనేక సంవత్సరాలుగా విరాళాలను సేకరిస్తుంది. ఒక్కో విపత్తుకు ఒక్కోరకంగా [more]
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ముందుంటాయి. విరాళాలను సేకరిస్తుంటాయి. బాధితుల కోసం ఈనాడు అనేక సంవత్సరాలుగా విరాళాలను సేకరిస్తుంది. ఒక్కో విపత్తుకు ఒక్కోరకంగా [more]
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ముందుంటాయి. విరాళాలను సేకరిస్తుంటాయి. బాధితుల కోసం ఈనాడు అనేక సంవత్సరాలుగా విరాళాలను సేకరిస్తుంది. ఒక్కో విపత్తుకు ఒక్కోరకంగా సాయం చేస్తూ ఉంటుంది. తుపాను బాధితుల కోసం సేకరించిన విరాళాలతో నిర్వాసితులకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఈనాడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఈ సాయం చేసింది. పక్కాగా విరాళాల సేకరణ, దానికి సంబంధించిన లెక్కలు రోజువారీ పాఠకులకు అందిస్తుంది.
విరాళాల సేకరణలో….
ఇక ఆంధ్రజ్యోతి విషయానికొస్తే ఈ పత్రిక కూడా అనేక సమయాల్లో విరాళాలను సేకరించింది. విపత్తు సమయంలో ఆంధ్రజ్యోతి సేకరించిన నిధుల ఖర్చుపై మాత్రం కొంత విమర్శలను ఎదుర్కొంటోంది. చివరకు రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అమరావతి నిర్మాణం కోసం కూడా ఆంధ్రజ్యోతి విరాళాలను సేకరించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది. ఈ విరాళాల లెక్క ఇంతవరకూ తేలలేదు.
కరోనా విపత్తుపై….
అయితే ఇప్పుడు కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టేసింది. అయితే ఈ రెండు పత్రికలు ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకకపోవడమే కారణంగా భావించాల్సి ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే విపత్తు పై ఈ రెండు పత్రికలు స్పందిస్తాయని, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలు లేకపోవడంతో ఆ పనికి పూనుకోలేదు.
అదే కారణం….
ఇందుకు మరో కారణం కూడా ఉంది. కరోనా వ్యాప్తి పత్రికల ద్వారా జరుగుతుందని భావించి పెద్ద యత్తున ఖాతాదారులు వైదొలిగారు. పత్రికలు కొనడం మానేశారు. దీంతోపాటు యాడ్స్ కూడా నిలిచిపోయాయి. లాక్ డౌన్ తో వ్యాపార సంస్థలే మూత పడినప్పుడు వీటికి యాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే పేజీలను తగ్గించి చిన్నగా లాక్కొస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పత్రికలు విపత్తుపై విరాళాల సేకరణకు పూనుకోక పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి మరో కారణం కూడా ఉండొచ్చు. పాఠకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి నుంచి విరాళాలు సేకరంచడం సరికాదని భావించి ఉండవచ్చు. కనీసం పత్రికా యాజమాన్యాలు కూడా కరోనాకు విరాళాలు ప్రకటించకపోవడం విడ్డూరం.