నాడు అమరావతి వద్దన్న వారే ఇప్పుడు…?
2014 డిసెంబర్ లో అమరావతి ప్రకటన వచ్చినది మొదలు ప్రతిరోజూ అమరావతి ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినవారు ఇప్పుడుఅమరావతి కావాలంటూ మీడియాలో కనిపిస్తున్నారు. వామపక్షాలు పూర్తిస్థాయిలో అమరావతి [more]
2014 డిసెంబర్ లో అమరావతి ప్రకటన వచ్చినది మొదలు ప్రతిరోజూ అమరావతి ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినవారు ఇప్పుడుఅమరావతి కావాలంటూ మీడియాలో కనిపిస్తున్నారు. వామపక్షాలు పూర్తిస్థాయిలో అమరావతి [more]
2014 డిసెంబర్ లో అమరావతి ప్రకటన వచ్చినది మొదలు ప్రతిరోజూ అమరావతి ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినవారు ఇప్పుడుఅమరావతి కావాలంటూ మీడియాలో కనిపిస్తున్నారు. వామపక్షాలు పూర్తిస్థాయిలో అమరావతి ప్రతిపాదనకు వ్యతిరేకంగా యుద్ధం చేశాయి. రైతు కూలీల ఇళ్ళల్లో (ఇప్పుడు రైతులు ఇళ్ళల్లో జరుగుతున్నట్టు) నిరసన దీక్షలు చేయించాయి. “ఇది ఎవరి రాజధాని?” అని వామపక్షాలతో పాటు చాలా మంది ప్రశ్నించారు. అమరావతి 29 గ్రామాల్లో పర్యటించారు. సదస్సులు, సభలు నిర్వహించారు. జస్టిస్ గోపాల గౌడ, మేధా పట్కర్, లాంటి మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజల పక్షపాత ఉద్యమకారులు ఈ గ్రామాల్లో పర్యటించారు. భూసమీకరణ వ్యతిరేకిస్తున్న రైతులకు, రైతు కూలీలకు “అండగా మేమున్నాం” అని మద్దతు పలికారు. అన్నా హజారే పంపిన బృందాలు వచ్చాయి.
వారు రాసిన పుస్తకాలు చదివి….
అమరావతి గ్రామాల్లో, విజయవాడలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో సభలు, సదస్సులు పెట్టారు. రైతుల తరపున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తలుపు తట్టారు. అమరావతి ప్రతిపాదన ప్రజా వ్యతిరేకం అంటూ పుస్తకాలూ రాశారు. అమరావతి ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్ లు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ నక్సలైట్లు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు ఇలా ఒక్కరేమిటి చాలా మంది ఉన్నారు. నాలుగేళ్ళుగా సాగిన ఈ ప్రచారం ప్రజలు నమ్మారు. వాళ్ళు రాసిన పుస్తకాలు చదివారు. “ఇంతమంది చెపుతుంటే నమ్మకుండా ఎలా?” అనుకుంటూ జనం నమ్మేశారు.
అమరావతి 29 గ్రామాలు ఉండే రెండు శాసనసభ నియోజక వర్గాల్లో అమరావతి ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి, మేధావులూ, ప్రజా ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, వామపక్షాల నేతలు ఇచ్చిన మహోపన్యాసాలకు, రాసిన పుస్తకాలకు ముగ్ధులైన ప్రజలు ఆమేరకు తీర్పు ఇచ్చారు.
మళ్లీ అమరావతి మనది అంటూ…..
ప్రభుత్వం మారింది. ఇంతమంది “వద్దు” అన్న అమరావతి ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇదే మేధావులు, ప్రజా ఉద్యమకారులు, వామపక్షాల నేతలు, తదితరులు అంతా “అమరావతి మనది” అంటున్నారు. “అమరావతిని వ్యతిరేకిస్తే ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించినట్టే” అంటున్నారు. ప్రజలు అమరావతినే కోరుకుంటున్నారు అంటున్నారు. మళ్ళీ జై అమరావతి అంటూ సభలు, సదస్సులు పెడుతున్నారు. పుస్తకాలూ రాస్తున్నారు. అప్పుడు రాసిన ఆ పుస్తకాలు ఏం చెయ్యాలి? అప్పుడు చెప్పిన ఆ ఉపన్యాసాలు ఏం చెయ్యాలి? ఇప్పుడు రాస్తున్న ఈ పుస్తకాలు ఏం చెయ్యాలి? ఇప్పుడు చెపుతున్న ఈ ఉపన్యాసాలు ఏం చెయ్యాలి? అప్పుడు మీ మాట విని వేసిన ఓటు తిరిగి తీసుకునేదెట్టా? ఇప్పుడు మీ మాట విని 2024లో వేసే ఓటు ఎవరికెయ్యాలి?తీరా ఓటేశాక, 2024 తర్వాత, మళ్ళీ మీరు ఇలాగే ప్రసంగాలు, పుస్తకాలూ మా మొహాన కొట్టరని, ప్రజాభిప్రాయం అంటూ వేదికలెక్కరని, ఉపన్యాసాలివ్వరని, పుస్తకాలు రాయరని పూచీ ఉందా?
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్