వీరంతా ఏమైపోయారు… ?
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పోలోమంటూ వైసీపీలోకి చాలా మంది నేతలు జంప్ అయ్యారు. వారిలో సీనియర్లు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా ఉన్నారు. అలాగే [more]
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పోలోమంటూ వైసీపీలోకి చాలా మంది నేతలు జంప్ అయ్యారు. వారిలో సీనియర్లు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా ఉన్నారు. అలాగే [more]
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పోలోమంటూ వైసీపీలోకి చాలా మంది నేతలు జంప్ అయ్యారు. వారిలో సీనియర్లు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా ఉన్నారు. అలాగే బలమైన సామాజిక వర్గ నేతలుగా ఉంటూ టీడీపీకి అండగా ఉండే నేతలు కూడా వైసీపీ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఒక విధంగా చూస్తే వారందరి రాకతో టీడీపీ దారుణంగా బలహీనపడింది. ఆ మేరకు వైసీపీ ఏమైనా బలపడిందా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా చేరిన నేతలు అంతా కూడా ఇలా కండువాలు కప్పించుకుని అలా సైడ్ అయిపోయారు. ఇపుడు వారి అయిపూ అజా అనుచరులకైనా తెలుస్తోందా అన్నదే డౌట్.
స్ట్రాంగ్ పిల్లర్స్….
మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, ఎస్ ఎ రహమాన్, తిప్పల గురుమూర్తిరెడ్డి వంటి వారు టీడీపీలో బాగా సౌండ్ చేసేవారు. వీరంతా అక్కడ కీలక నేతలు, అలాంటి వారు వైసీపీలో చేరి పూర్తిగా తన పేర్లు కూడా మరచిపోయే స్థితికి వచ్చారా అన్న చర్చ అయితే ఉంది. ఇక మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా వైసీపీలో చేరాక హుషార్ తగ్గించేశారు. విశాఖ కార్పోరేషన్ ఎన్నికల వేళ బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన రియల్టర్ కాశీ విశ్వనాధ్ టీడీపీకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. లేటెస్ట్ గా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. మరి వీరంతా ఇపుడు ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదుట.
అదేనా కారణం…?
వీరు వైసీపీలో చేరినా సౌండ్ లేకపోవడానికి కారణం పార్టీ ఏ బాధ్యతలు అప్పగించలేదని, ఏ పదవులూ ఇవ్వలేదని వారి అలకట. అదే విధంగా అధికార పార్టీలో చేరిన మీదట సహజంగా సొంత పనులు అవుతాయి, వ్యాపారాలలో ఉన్న వారికి కూడా కలసి వస్తుంది. వారి హవాకు తిరుగు ఉండదు. ఇలాంటి లెక్కలు వేసుకునే ఎవరు పవర్ లో ఉంటే వారికి జై కొడతారు. కానీ సీన్ చూస్తే వైసీపీలో చేరినా బయట ఉన్నా ఒక్కలాగే ఉందని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. ఇక వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతలకు కొత్త పూజారులకు మధ్యన సఖ్యత లేకపోవడం వల్ల కూడా వారు దూకుడు చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.
ఉండే వారేనా …?
ఇవన్నీ ఆలోచించినపుడు వారు నిజంగా వైసీపీలో కొనసాగుతారా అన్న చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో వస్తోంది. వచ్చారు కాబట్టి చేర్చుకున్నామన్న ధోరణిలో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఎవరు తమ పార్టీ విధానాలు నచ్చి చేరినా ఆహ్వానిస్తామని అంటున్నారు. అయితే వచ్చిన ప్రతీ వారికీ పదవులు ఇవ్వడం కుదిరే పని కాదని కూడా ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. పార్టీ కోసం పదేళ్ళుగా పనిచేసిన వారు పెద్ద ఎత్తున ఉన్నారని, అలాంటి పరిస్థితులలో కొత్త వారికి అవకాశాలు రావడానికి టైమ్ పడుతుంది అని అంటున్నారు. అలా ఓపికగా ఉంటూ పార్టీ కోసం నిజాయతీగా పనిచేసేవారికే జగన్ ప్రాధాన్యత ఇస్తారని కూడా అంటున్నారు. మరి ఇవన్నీ చూశాక ఈ నేతలు వైసీపీలో ఉంటారా లేక టైమ్ చూసుకుని మరో బిగ్ జంప్ చేస్తారా అన్నదే చర్చగా ఉంది మరి.