ఓరి… వీరి దుంప తెగ… కరోనాను వాడేస్తున్నారే?
ప్రపంచం కరోనా భయంతో గజగజా వణుకుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయంతో సగం ఛస్తూనే ఎలాగోలా నిత్యావసరాలు ఇంటికి చేరుస్తున్నారు. ఇక వాకింగ్, టాకింగ్, డ్రింకింగ్ అన్ని బంద్. [more]
ప్రపంచం కరోనా భయంతో గజగజా వణుకుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయంతో సగం ఛస్తూనే ఎలాగోలా నిత్యావసరాలు ఇంటికి చేరుస్తున్నారు. ఇక వాకింగ్, టాకింగ్, డ్రింకింగ్ అన్ని బంద్. [more]
ప్రపంచం కరోనా భయంతో గజగజా వణుకుతుంది. బయటకు వెళ్లాలంటేనే భయంతో సగం ఛస్తూనే ఎలాగోలా నిత్యావసరాలు ఇంటికి చేరుస్తున్నారు. ఇక వాకింగ్, టాకింగ్, డ్రింకింగ్ అన్ని బంద్. ఇలాంటి సమయంలో స్మార్ట్ ఫోన్ మాత్రమే అందరికి ఎంటర్ టైన్ మెంట్. అది కూడా కొందరికి బోర్. ఎందుకంటే మధుప్రియులకు నాలుగు గ్లాస్ లు గలగలమంటే కానీ తోచదు. అలాగే చతుర్ముఖ పారాయణదాసులకు ఆట ఆడలేదంటే రోజు గడవదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో మందు బంద్ అయ్యి మధుప్రియులు ఏకంగా తనువులు చాలిస్తున్నారు. పేకాట రాయుళ్ళు ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులకు ఈ ఆట నేర్పి మరి ఆడేసుకున్నా పెద్దగా తృప్తిగా లేరు. అలా అని నలుగురు మిత్రుల్ని పోగేసుకుని ఆడదామంటే ఎవరు దగ్గినా తుమ్మినా హడలి పోయి ఇంటికే పరిమితం అయిపోతున్నారు. క్లబ్ లు పబ్ లతో నిత్యం హడావిడిగా గడిపేవారికి ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో కాలక్షేపం కావడం లేదు.
రంగంలోకి ఆన్ లైన్….
ఆన్ లైన్ పేకాట లేక క్రికెట్ బెట్టింగ్ లు మన దేశంలో బాగా పాపులర్. పేకాట కు అయితే సామాజిక వేదికల్లో వచ్చే ప్రకటనలు అన్ని ఇన్ని కావు. ఈ ఆట రానివాడు కూడా వారిచ్చే ప్రకటనలు చూసి నేర్చుకుని జాక్ పాట్ కొట్టేయాలన్నంత ఇదిగా అవి ఉంటాయి. అలాంటి ప్రకటనలతో అదరగొట్టే ఆన్ లైన్ రమ్మీ గేమ్ కి నిర్వాహకులు మహా గొప్ప ప్రకటన విడుదల చేశారు. అదేమిటి అంటే నలుగురు కూర్చుని పేకాట ఆడుతూ ఉంటే ఒకరు దగ్గడం మరొకరు తుమ్మడం వంటి వాటిని చూపించి ఇలాంటి సమయంలో అందరు కూర్చుని పేకాట ఆడటం ప్రాణాలకే ప్రమాదమని సందేశం ఇస్తూనే ఆన్ లైన్ రమ్మీ మీకు సేఫ్ అంటూ ఉదరగొట్టేస్తున్నారు.
మల్టీ నేషనల్ కంపెనీలు అదే బాట …
ఇదొక్కటే కాదు కరోనా వైరస్ ను ఆసరాగా చేసుకునే ఇప్పుడు మల్టీ నేషనల్ కంపెనీలు ప్రకటన స్టయిల్ మార్చేశాయి. దినపత్రికలపై వైరస్ ప్రభావం అనే అనుమానాలు తుడిచేందుకు మేం శానిటైజర్ లతో స్ప్రే చేస్తున్నాం మా పేపర్ ఢోకా లేదంటున్నాయి. ఇక బలవర్ధకమైన ఆహరం తో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి అంటూ ఫుడ్ ప్రోడక్ట్ కి సంబంధించిన వారు విరుచుకుపడుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే ఫలానావి తింటే కరోనా దూరం అంటూ రేటింగ్స్ కోసం మరికొందరు అన్ని వైద్యాలు అందిస్తూ ప్రజల మానసిక స్థితిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇలా ఎవరికి వారు తమ సొంత ప్రయోజనాలకోసం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ను వినియోగించేయడం చూసి అంతా ముక్కున వేలేసుకుని ఫక్కున నవ్వుకుంటున్నారు.